Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రోజు ఆయన ఏ సినిమా షూటింగ్ లో ఉంటాడో, ఆయనకే తెలియదు. ఒకే సమయంలో ఆయన రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటాడు. గడిచిన మూడేళ్ళలో ఆయన నాలుగు సినిమాలు విడుదల చేసాడు. అందులో రెండు చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి. ఈ ఏడాది విడుదలైన ‘కల్కి’ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ‘రాజా సాబ్’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ నెలలోనే దాదాపుగా 80 శాతం కి పైగా టాకీ పార్ట్ ని పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా తో పాటు రీసెంట్ గానే ఆయన హను రాఘవపూడి తో ఫౌజీ అనే చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పీరియాడిక్ లవ్ స్టోరీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ లేకుండా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. రజాకార్ మూవ్మెంట్ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ ప్రేమకథ ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ హను. ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఒక పాకిస్తాన్ అమ్మాయి, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మధ్య జరిగే ప్రేమ కథ ని చాలా డిఫరెంట్ గా, ఎమోషనల్ గా ఈ సినిమాని తీయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం డైరెక్టర్ హను రాఘవపూడి ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈమెకి ఇదే మొట్టమొదటి సినిమా, అంతకు ముందు ఇంస్టాగ్రామ్ లో ఒక పాపులర్ సెలబ్రిటీ గా చలామణి అవుతూ ఉండేది. ఈమె రీల్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యేవి, ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ డైరెక్టర్ కి బాగా నచ్చడం తో వెంటనే ఆమెని సంప్రదించి ఈ సినిమాకి తీసేసుకున్నాడు.
400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో, రెమ్యూనరేషన్స్ కూడా ఆర్టిస్ట్స్ కి బాగానే ఉంటుందని అందరూ అనుకోవడం సహజం. కానీ హీరోయిన్ ఇమాన్వి కి కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 20 లక్షల రూపాయిలు మాత్రమే. అంతే కాదు ఈ సినిమా పూర్తి అయ్యే వరకు ఆమె మరో సినిమా చేసేందుకు వీలు లేదట. ఈ అగ్రిమెంట్ తోనే ఆమెని ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఈమధ్య కాలం లో ఆమెకి రెండు మూడు క్రేజీ ఆఫర్స్ వస్తే వాటిని కూడా ఈ కారణం చేతనే వదులుకోవాల్సి వచ్చిందట. అయితే ప్రభాస్ తో ఒక ఇసినిమా చేసే అవకాశం రావడమే వంద కోట్ల రెమ్యూనరేషన్ తో సమానం, పైగా ఆమెకి ఈ చిత్రంలో నటనకి ప్రాధాన్యం ఉండే పాత్ర దొరికిందట, ఉచితంగా అవకాశం ఇచ్చినా చేస్తానని చెప్పిందట. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అమ్మాయి సునామీ ని చూడొచ్చు అనే చెప్పాలి.