Chiranjeevi Movie Sreeleela Remuneration : ఐటెం సాంగ్స్ కి ఇప్పుడు మన టాలీవుడ్ లో మామూలు డిమాండ్ లేదు. ఒక సినిమా భవిష్యత్తుని మార్చే దిశలో ఉన్నాయి ఐటెం సాంగ్స్. ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయితే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ మోతమోగిపోతాయి. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కేవలం యూత్ ఆడియన్స్ వల్ల వస్తాయి. ఈ కాలం లో ఒక సినిమాకు ఓపెనింగ్ రావాలంటే యూత్ ఆడియన్స్ థియేటర్స్ కి కదలడం అత్యవసరం. కేవలం ఓపెనింగ్ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాదాపుగా అందుకునే రోజులివి. వాళ్ళని ఆకర్షించాలంటే ట్రైలర్ బాగుండాలి, లేకపోతే పాటలు అయినా బాగుండాలి. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా పాటలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ ఐటెం సాంగ్స్ కి హీరోయిన్స్ కూడా కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్నాడు. అందుకే ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కి నో చెప్పిన శ్రీలీల(Sreeleela) ఇప్పుడు ఆ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
Also Read : కొత్త ప్రియుడితో దుబాయ్ టూర్ కి సమంత..సంచలనంగా మారిన ఫోటోలు!
గత ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం లో ‘కిస్సిక్'(Kissik Song) అనే పాటలో ఆడిపాడింది శ్రీలీల. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు పుట్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఈ పాట కోసం థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. ఈ పాట బాలీవుడ్ ని షేక్ చేయడంతో శ్రీలీల కి బాలీవుడ్ లో హీరోయిన్ ఆఫర్స్ కూడా వరుసగా వస్తున్నాయి. మరోపక్క తమ సినిమాల్లో ఐటెం సాంగ్ చేయమని ఈమె పై చాలా ఒత్తిడి తెస్తున్నారు. కానీ శ్రీలీల మాత్రం డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని ప్రతీ ఒక్కరికి ఓకే చెప్పకుండా కేవలం తనకు ఇష్టమైన వాళ్లకు మాత్రమే ఓకే చెప్తుంది. రీసెంట్ గా ఈమె మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi),అనిల్ రావిపూడి(Anil Ravipudi) చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందట.
ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ పాటలు ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉంటున్నాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ఒక్కో పాట ఎలా హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘గోదారి గట్టు’ పాట అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అలాంటి ఒక సెన్సేషనల్ సాంగ్ ని ఈ సినిమా కోసం కంపోజ్ చేసాడట. ఈ ఐటెం సాంగ్ కి కేవలం శ్రీలీల మాత్రమే న్యాయం చేయగలదు అని చిరంజీవి కి అనిల్ రావిపూడి చెప్పడంతో స్వయంగా చిరంజీవి శ్రీలీల ని రిక్వెస్ట్ చేయడం, ఆమె సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పడం జరిగిపోయిందట. అంతే కాదు ఈ పాట కోసం ఆమె ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదని తెలుస్తుంది.