ఎంటర్టైన్మెంట్Samantha: అమెరికాలో సమంత క్రేజ్... జస్ట్ చూసేందుకు రూ. 2 లక్షల టికెట్!

Samantha: అమెరికాలో సమంత క్రేజ్… జస్ట్ చూసేందుకు రూ. 2 లక్షల టికెట్!

Samantha: ఎక్కడికి వెళ్లినా పని, సంపాదన వదలడం లేదు సమంత. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అమ్మడు ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. యూఎస్ లో సమంత చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఆమె లేడీ ఓరియెంట్ మూవీ బేబీ ఏకంగా వన్ మిలియన్ వసూళ్లు అధిగమించి రికార్డులకు ఎక్కింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ వన్ మిలియన్ చేరుకోవడం గొప్ప విశేషం. దీంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సమంత చేత ఖుషి చిత్ర ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అదే సమయంలో డబ్బులు ఆర్జిస్తున్నారు.

తాజాగా న్యూయార్క్ లో ఖుషి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సమంత ఛార్జ్ చేశారట. సాధారణంగా చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనేందుకు హీరోయిన్స డబ్బులు తీసుకోరు. కేవలం ఖర్చులు మాత్రం వసూలు చేస్తారు. అయితే న్యూయార్క్ ఈవెంట్ కి సమంత రూ. 30 లక్షలు తీసుకున్నారట. నిర్వాహకులు కూడా తక్కువేం తినలేదు. ఈవెంట్ కి హాజరయ్యే వాళ్ల దగ్గర నుండి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేశారట.

టికెట్ ధర రూ. 2 నుండి 12 వేలుగా నిర్ణయించారట. ఇక సమంతను దగ్గరగా చూసేందుకు గానూ రూ. 2 లక్షల రూపాయల టికెట్ పెట్టారట. సమంతను చూడాలన్న కొందరు ఔత్సాహికులు రెండు లక్షలు లెక్క చేయకుండా టికెట్స్ కొన్నారట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఓ హీరోయిన్ ని చూసేందుకు రూ. 2 లక్షలు అంటే సాధారణ విషయం కాదు కదా… ఇక ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించారు.

ఖుషి చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. అలాగే సమంత సిటాడెల్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ హీరో. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇక సమంతకు అమెరికాలో ట్రీట్మెంట్ జరగనునట్లు సమాచారం. కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ఈ మధ్యలో కొత్త చిత్రాలేవీ చేయరట.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Samantha Ruth Prabhu : 100 కోట్ల క్లబ్ లోకి ‘మా ఇంటి బంగారం’.. సంబరాల్లో ‘బేబీ బంప్’ తో దర్శనమిచ్చిన సమంత.. వీడియో వైరల్..

Samantha Ruth Prabhu : సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్...

Samantha: ‘లెనిన్’ మూవీ పై సమంత హాట్ కామెంట్స్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్..

Samantha: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version