https://oktelugu.com/

Samantha Bold Show : యాడ్స్ కోసం బోర్డర్స్ దాటేసిన సమంత !

 Samantha Bold Show: ఒకపక్క సమంత (Samantha) వ్యక్తిగత జీవితం పై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మరోపక్క సమంత మాత్రం రోజురోజుకు ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. ఈ మధ్య వరుసగా యాడ్ ఫిల్మ్స్ చేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో చాలా బ్రాండ్ లున్నాయి. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ ఆ రకంగానూ బాగా సంపాదిస్తోంది. అయితే, సమంతలో చాలా మార్పు వచ్చింది. కొన్ని యాడ్స్ కోసం గ్లామర్ డోస్ భారీగా పెంచేస్తోంది. […]

Written By:
  • admin
  • , Updated On : September 9, 2021 / 09:52 AM IST
    Follow us on

     Samantha Bold Show: ఒకపక్క సమంత (Samantha) వ్యక్తిగత జీవితం పై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మరోపక్క సమంత మాత్రం రోజురోజుకు ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. ఈ మధ్య వరుసగా యాడ్ ఫిల్మ్స్ చేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో చాలా బ్రాండ్ లున్నాయి. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ ఆ రకంగానూ బాగా సంపాదిస్తోంది.

    అయితే, సమంతలో చాలా మార్పు వచ్చింది. కొన్ని యాడ్స్ కోసం గ్లామర్ డోస్ భారీగా పెంచేస్తోంది. గతంలో కూడా సమంత ఓవర్ గ్లామర్ గా కనిపించినా.. ప్రస్తుత యాడ్స్ లో చేసినంత ఓవర్ ఎక్స్ పోజింగ్ గతంలో ఎప్పుడూ చేయలేదు. తాజాగా ఒక బ్యాగ్ ల బ్రాండ్ కోసం ఒక యాడ్ చేసింది. ఆ యాడ్ లో సమంత డ్రెస్ పైనే ఇప్పుడు అందరి చూపు పడింది.

    పైగా ఆ యాడ్ కి సంబంధించిన ఫోటోలను సమంతనే షేర్ చేయడం ఇక్కడ మరో హాట్ టాపిక్. హాట్ ఫోటోలే అనుకుంటే.. ఇక సామ్ షేర్ చేసిన వీడియోలో అయితే కవ్వింపు ఫోజులు, హాట్ హాట్ లుక్స్.. మొత్తానికి నెటిజన్లకు సమంత భారీ షాక్ ఇచ్చింది. యాడ్స్ కోసం బోర్డర్స్ దాటేసిన సమంత అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    దాంతో సోషల్ మీడియాలో ఆ బ్యాగ్ ల యాడ్ వీడియోకి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక సామ్ గత వారమే గోవా ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చింది. చైతుతో కలిసి ఉండటం లేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

    త్వరలోనే సమంత – చైతు విడిపోతున్నారని కూడా బాగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి అయితే, సామ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కుక్కతో ఆడుకునే వీడియోలు అప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.