https://oktelugu.com/

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా.. ఎంత ట్యాక్స్ చెల్లించాలంటే?

Lottery Tax: మన దేశంలో వ్యక్తులు లేదా వేర్వేరు సంస్థలు సంపాదించే మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏ మార్గంలో డబ్బు సంపాదించినా తప్పనిసరిగా పన్ను మాత్రం చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్నింటికి మాత్రమే పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఏ మార్గంలో ఎంత ఆదాయం వచ్చిందనే అంశాలను బట్టి ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే లాటరీ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వస్తే ట్యాక్స్ కట్టాలని నిపుణులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 9, 2021 / 09:49 AM IST
    Follow us on

    Lottery Tax: మన దేశంలో వ్యక్తులు లేదా వేర్వేరు సంస్థలు సంపాదించే మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏ మార్గంలో డబ్బు సంపాదించినా తప్పనిసరిగా పన్ను మాత్రం చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్నింటికి మాత్రమే పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఏ మార్గంలో ఎంత ఆదాయం వచ్చిందనే అంశాలను బట్టి ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది.

    అయితే లాటరీ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వస్తే ట్యాక్స్ కట్టాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం సెక్షన్ 115bb కింద 30 శాతం ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో గెలుచుకున్న బహుమతులకు సైతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కారు, బైక్ లేదా ఇతర వాహనాలను లాటరీలో గెలుచుకుంటే మోటారు కారు విలువను బట్టి డెవలపర్ ట్యాక్స్ ను వసూలు చేయడం జరుగుతుంది.

    లాటరీలో వాహనాలను బహుమతులుగా గెలుచుకున్న వాళ్లు ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో కూడా ఈ ఆదాయాన్ని అందులో చేర్చాలి. ఈ మొత్తానికి టీడీఎస్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. లక్కీ డ్రా ద్వారా పొందే ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ వర్తించే అవకాశంతో పాటు టీడీఎస్ రేటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏదైనా బహుమతిని గెలుచుకున్న వాళ్లు రీఫండ్ ను పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

    వాహనం విలువతో పాటు ఆదాయం మొత్తం 5 లక్షల రూపాయల లోపు ఉంటే మాత్రం 12,500 రూపాయల వరకు సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందే అవకాశం అయితే ఉంటుంది.