Samantha Birthday: సమంత పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఆమె చేస్తున్న మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’ నుంచి.. ‘సామ్ బర్త్ డే’ స్పెషల్ గా ఒక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సమంత ప్రకృతిలో, వన్యప్రాణుల మధ్య సేద తీరుతూ అచ్చం దేవకన్యలా కనిపిస్తోంది. పురాణాల్లో దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమ, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం లాంటి అంశాలతో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Samantha Birthday
పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించింది. అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంది. అందుకే సామ్, తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది.
Also Read: Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా?
ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ పోస్టర్ అయితే నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారాలపట్టి ‘అల్లు అర్హ’ భరతుడి చిన్నప్పటి పాత్రలో నటిస్తోంది. శాకుంతలం సినిమాలో అర్హ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది.
Samantha Birthday
ఏమైనా స్టార్ కిడ్స్ లో అర్హకు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. తన పలుకులతో తన చేష్టలతో ఈ అల్లు వారి గారాల పట్టి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. బన్నీగా పోటీగా అభిమానులను అలరిస్తోంది. అర్హ.. అల్లు అర్జున్ నట వారసురాలిగా త్వరలో వెండితెరపై మెరవడానికి బాల భరతుడిగా అరంగ్రేటం చేయబోతుంది. పైగా సమంత – అర్హ మధ్య సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయట.
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో కలసి గుణ శేఖర్ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి తెగ కష్టపడుతుంది. మరోపక్క తన కెరీర్ లోనే తొలిసారిగా చేస్తున్న మైథాలాజికల్ మూవీ కావడంతో సమంత కూడా ఈ సినిమాకి ఫుల్ కోపరేట్ చేస్తోంది.
Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY
— Gunasekhar (@Gunasekhar1) April 28, 2022
Recommended Videos: