https://oktelugu.com/

Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా?

Advance Bookings: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన తర్వాత లాక్ డౌన్ మొత్తం ఎత్తివేయడం తో ఎప్పటి నుండో విడుదలకి సిద్ధంగా ఉన్న మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్ని వరుసగా ఒక్కదాని తర్వాత ఒక్కటి విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భీమ్లా నాయక్ సినిమా తో ప్రారంభం అయినా బాక్స్ ఆఫీస్ జాతర మొన్న KGF చాప్టర్ 2 వరుకు కొనసాగింది..ఇక రేపు విడుదల అవ్వబోతున్న ఆచార్య సినిమా నుండి అదే స్థాయి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2022 / 01:32 PM IST
    Follow us on

    Advance Bookings: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన తర్వాత లాక్ డౌన్ మొత్తం ఎత్తివేయడం తో ఎప్పటి నుండో విడుదలకి సిద్ధంగా ఉన్న మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్ని వరుసగా ఒక్కదాని తర్వాత ఒక్కటి విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భీమ్లా నాయక్ సినిమా తో ప్రారంభం అయినా బాక్స్ ఆఫీస్ జాతర మొన్న KGF చాప్టర్ 2 వరుకు కొనసాగింది..ఇక రేపు విడుదల అవ్వబోతున్న ఆచార్య సినిమా నుండి అదే స్థాయి బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర రాబొయ్యే రోజుల్లో కూడా కొనసాగబోతుంది..ఒక్క రాధే శ్యామ్ సినిమా మినహా ఈ ఏడాది ఇప్పటి వరుకు విడుదల అయినా స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది..ఈ దెబ్బ తో ఇనాళ్ళు కుదేలు అయ్యిపోయిన తెలుగు సినిమా పరిశ్రమ కి కొత్త ఊపిరి వచ్చింది..రేపు ఆచార్య సినిమా విడుదల అవ్వబోతుండడం తో ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసింది..? భీమ్లా నాయక్ , #RRR మరియు KGF చాప్టర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

    Advance Bookings

    ముందుగా భీమ్లా నాయక్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోశియుమ్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యింది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత చేసిన ఊర మాస్ సినిమా కావడం తో ఈ మూవీ కి ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఆంధ్ర ప్రాంతం లో ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ రేట్స్ మరియు అదనపు షోస్ ఇవ్వకపోవడం తో తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయింది..ఇక తెలంగాణ లో అయితే విడుదలకి ముందు ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క హిస్టరీ అనే చెప్పొచ్చు..295 రూపాయిల టికెట్ రేట్స్ తో ప్రారంభించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల సమయానికి నైజం ప్రాంతం లో టికెట్ ముక్క కూడా దొరకలేదు..అలా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్ సిటీ నుండి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వరుకు వసూలు చేసి సంచలనం సృష్టించింది..ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి కేవలం ప్రీ సేల్స్ ద్వారా అన్ని స్టేట్స్ నుండి 1 మిలియన్ కి పైగా డాలర్లు వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 36 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.

    Also Read: AP Women Commission: బాధితులకేదీ స్వాంతన? విమర్శలపాలవుతున్న ఏపీ మహిళా కమిషన్

    భీమ్లా నాయక్ సినిమా తర్వాత విడుదల అయినా ప్రతి సినిమాకి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్ కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం..దీని వల్ల ఆంధ్ర లో భీమ్లా నాయక్ కి ఆ తర్వాత విడుదల అయినా సినిమాలకు గ్రాస్ లో చాలా తేడానే ఉంది..భీమ్లా తర్వాత విడుదల అయినా రాధే శ్యామ్ కి టికెట్ హైక్ ఉన్నప్పటికీ కూడా క్లాస్ సినిమా కావడం తో ఆశించిన స్థాయి ఓపెనింగ్ ని దక్కించుకోలేదు..భీమ్లా కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 36 కోట్ల రూపాయిలు రాగా, రాధే శ్యామ్ కి 30 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది..ఇక ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన #RRR కి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కనివిని ఎరుగని రేంజ్ గ్రాస్ వచ్చింది..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో భారీ టికెట్ రేట్స్ హైక్ తో వచ్చిన ఈ సినిమా కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకుంది..ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అన్ని భాషలకు కలిపి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది..ఇక ఈ సినిమా తర్వాత విడుదల అయినా KGF 2 కి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 100 కోట్ల రూపాయిలు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు అయ్యాయి..ఇక రేపు విడుదల అవ్వబోతున్న ఆచార్య సినిమాకి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే 40 కోట్ల రూపాయిల గ్రాస్ అడ్వాన్క్ ఏబూకింగ్స్ ద్వారా వసూలు చేసి ఉంటుంది అని అంచనా.

    Also Read: Acharya Advance Bookings: 2000 థియేటర్స్ లో ఆచార్య.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా!

    Recommended Videos:

    Tags