Samantha: నాగచైతన్య – సమంత ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని.. క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో చలామణి అయి.. సడెన్ గా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించి.. కొన్నాళ్ళు పాటు మీడియాకి మంచి మసాలా సరుకు అదించారు. ఈ క్రమంలో సమంత ఎఫైర్లు అంటూ.. రోజుకొక రూమర్ తో మంచి వ్యూస్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది మీడియా.

ఇక ఆ తర్వాత సామ్ – చైతు ఇద్దరూ విడాకుల విషయం పై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అసలు విడిపోవడానికి ఎలాంటి విబేధాలు కారణాలు అంటూ మీడియా కూడా నాలుగు రోజులు వార్తలు వండి చివరకు బోర్ కొట్టి వదిలేసింది. కానీ, అందరూ వదిలేసిన దాన్ని మళ్ళీ సామ్ పట్టుకుంది. సమంత ఓ హిందీ సినిమా షూట్ కోసం ముంబై వెళ్లి, అక్కడి మీడియాకి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ఇస్తే ఇచ్చింది. వాటిల్లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. అలాగే తన పై జరిగిన ట్రోలింగ్ గురించి, తనని అసలు ఎలా బద్నామ్ చేశారు లాంటి విషయాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి హడావుడి చేసింది. ఆ ఇంటర్వ్యూలు తెలుగు మీడియాలో కూడా వచ్చాయి. అయితే, దాదాపుగా అన్ని ఇంటర్వ్యూలలో ఒకటే క్యాసెట్ వేసి సమంత బాగానే బోర్ కొట్టించింది.
అసలు జనం మర్చిపోయిన విషయాన్ని మాట్లాడి, మళ్ళీ దాని గురించి ఇక మాట్లాడను అంటూ కబుర్లు చెబుతుంది. అయినా అరిగిపోయిన క్యాసెట్ ను ఎన్నాళ్ళు వేస్తావ్ సమంత ? అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇండిపెండింట్ వుమెన్. పేదరికంలో నుంచి తన సొంత కాళ్ల పై స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
Also Read: Anchor Ravi: వారి మీద సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ రవి..!
ఆమె నేపథ్యానికి.. చైతు నేపథ్యం పూర్తిగా వేరు. ఇద్దరి మధ్య ఈ వైరుధ్యంతో పాటు ఆలోచనా విధానం కూడా విబేధాలకు పునాది అయింది. దీనికితోడు పెళ్లి తర్వాత సమంత కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయింది. దాంతో చైతు కంటే బిజీగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అంతలో కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయి. మొత్తానికి పెళ్లి పెటాకులు అయింది.
Also Read:Bollywood: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా లకు కరోనా పాజిటివ్…