Samantha and Shobhita Dhulipalla : సమంత, శోభిత దూళిపాళ్ల పేరు సోషల్ మీడియా లో ఎప్పటికీ నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్లిద్దరు పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్లు , దానికి తోడు వీళ్లిద్దరు నాగ చైతన్య కి సంబంధించిన వాళ్ళు కాబట్టి. సమంత నాగచైతన్య మాజీ భార్య కాగా, శోభిత దూళిపాళ్ల ప్రస్తుత భార్య. సోషల్ మీడియా లో ఇప్పటికీ నాగ చైతన్య, సమంత గురించి రోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్లకు సంబంధించిన వార్తలు ఎన్ని వచ్చినా జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారిలో ఉన్న ఆ ఆసక్తిని గమనించి యూట్యూబ్ చానెల్స్ డబ్బులు రకరకాల కథనాలను ప్రచారం చేస్తూ డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటాయి. సమంత ఇలాంటి ఫేక్ ప్రచారాలపై అసహనం వ్యక్తం చేసి పోలీస్ కేసు కూడా వేసింది. అయినప్పటికీ ఈ ఆమెపై కథనాలు రావడం ఆగకపోవడంతో పట్టించుకోవడం మానేసింది.
ఇదంతా పక్కన పెడితే సమంత, శోభిత భద్ర శత్రువులు అనే కథనం కూడా చాలా కాలం నుండి ప్రచారం అవుతుంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. ఒకప్పుడు శోభిత సమంత కి మంచి స్నేహితురాలట. ఇద్దరు కలిసి పలు యాడ్స్ లో కూడా నటించారు. నాగ చైతన్య తో శోభిత పెళ్లి తర్వాత వీళ్ళ మాటలు తగ్గిపోయి ఉండొచ్చేమో కానీ, ఒకరిని ఒకరు ద్వేషించుకునే రేంజ్ గ్యాప్ అయితే వీళ్ళ మధ్య లేదు. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో శోభిత సమంత గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఇప్పుడు ఆమెని సమంత గురించి అడిగినా అలాగే మాట్లాడుతుంది. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన మజిలీ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ క్యారక్టర్ కోసం ముందుగా శోభిత ని తీసుకున్నారట.
ఆమెతో పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెని ఆ చిత్రం నుండి తప్పించాల్సి వచ్చిందట. ఆమెకు బదులుగా దివ్యంషా కౌశిక్ ని తీసుకున్నారు. అంతకు ముందే బాలీవుడ్ లో వీళ్లిద్దరు కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో నటించారు. నాగ చైతన్య తో సమంత వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు శోభిత అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేదట. అలా వాళ్ళ మధ్య ఒకప్పుడు మంచి సన్నిహిత్యమే ఉండేది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. శోభిత కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది కానీ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా లేదు. ఎందుకంటే ఆమె తెలుగు లో ఇప్పటి వరకు గూఢచారి, మేజర్ వంటి సినిమాలు మాత్రమే చేసింది. సోషల్ మీడియా లో మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఉంది.