JC Prabhakar Reddy : సమాజం చాలా తెలివైంది. అన్ని అంశాలను పసిగడుతుంది. తప్పులను సహించదు కూడా. తాము అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసినా చెల్లు బాటు అవుతుందని భావించే వారికి.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరిణామాలే ఉదాహరణ. ఎన్నికల్లో గెలుపోవటములకు ఒక్క పనితీరే కొలమానం కాదు. పార్టీతో పాటు తమ చుట్టూ ఉన్న వారి వ్యవహార శైలి సైతం ప్రభావం చూపుతుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అటువంటి నేతలు తెచ్చారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అటు తరువాత మాజీ మంత్రిగా కొడాలి నాని తమ ప్రత్యర్థులైన చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్లపై నోరు పారేసుకునేవారు. వైసిపి పై అసహ్యం ఏర్పడడానికి కొడాలి నాని తనవంతు పాత్రను పోషించారు. వైసీపీ అంటే సభ్యత, సంస్కారం లేని పార్టీగా విద్యావంతులు, తట్టస్థులు నెగిటివ్ ముద్ర వేయడానికి కొడాలి నాని తో పాటు మరికొందరు నాయకులు కారణం.
* కొడాలి నాని మాదిరిగా
అయితే వైసిపి అపజయంలో ఎదురైన గుణపాఠా లను నేర్చుకోవడం లేదు కూటమి ప్రభుత్వం. ఒకరిద్దరూ టిడిపి నాయకులు అచ్చం కొడాలి నాని లాగే మాట్లాడుతున్నారు. పార్టీకి నష్టం చేసేలా ఉన్నారు. సమాజంలో ఏ పార్టీతో సంబంధం లేని వారు సైతం ఉంటారన్న విషయాన్ని గ్రహించాలి. వారికి తప్పనిపిస్తే ఏ స్థాయిలో తిప్పి కొడతారో మొన్నటి వైసిపి ఓటమి తెలియజేస్తుంది. అయితే దానిని గుర్తించలేని స్థితిలో కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. అప్పట్లో వైసీపీ నేతలు మాదిరిగా మాట్లాడుతున్నారు.
* జెసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్
తాజాగా మీడియా ముందుకు వచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. ఆయన సైతం కొడాలి నాని మాదిరిగా పదప్రయోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పేర్ని నానిని ఉద్దేశించి.. ఏకంగా ప్రెస్ మీట్ లోనే ఒరేయ్, నా కొడకా, ఇంటి కాడికి వచ్చే తంత నీకు దిక్కు ఎవరు? లాంటి మాటలను అలవోకగా జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయి. అయితే టిడిపి అనుకూల మీడియా దీనిపై రెచ్చిపోతోంది. కానీ ఇటువంటి అసభ్య కామెంట్స్ ను తటస్తులు హర్షించరు. అసహ్యించుకోవడం ఖాయం. మరి ఈ విషయంలో చంద్రబాబు జెసి ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేస్తారా? అలానే వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.