
సమంత అక్కినేని అంటేనే ఫుల్ క్రేజ్.. అటు ఫ్యాషన్ లోనూ.. ఇటు సినిమాల సెలెక్షన్ లోనూ సమంతకు ఓ ప్రత్యేకత ఉంది. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసి.. కొన్ని సినిమాల్లో చిన్నాచితకా పాత్రల్లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఆ తరువాత తన తొలి చిత్రమైన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి.. మొత్తానికి అక్కినేని కోడలు అయిపోయింది. చైతు ఇల్లాలిగా మారాకా సమంత ఏం చేసినా దానికి తిరుగులేకుండా పోయింది. ఏదైనా ట్రెండ్‌ను క్రియేట్ చేయాలన్నా.. డిసైడ్ చేయాలన్నా తాను ఓ అడుగు ముందే ఉంటూ మొత్తానికి ఫుల్ బిజీగా ఉంది సమంత.
Also Read: స్టార్ డైరెక్టర్ ను దూరం పెట్టిన స్టార్ హీరో !
ఇంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన కొన్ని విషయాల్లో మాత్రం సమంత అస్సలు వెనక్కి తగ్గడం లేదు. సమంత పుట్టింది క్రిస్టియన్ గా… అందుకే ఆమెకు చిన్నప్పటి నుండి క్రిస్మస్ నాడు చర్చిలో ప్రార్థనలు చేయడం అలవాటు అట. మరో 9 రోజుల్లో క్రిస్మస్ పండుగ కాబట్టి.. తన ఇల్లుని క్రిస్మస్ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది. ప్రతి సంవత్సరం తన ఇంటిని క్రిస్మస్ నాడు ప్రత్యేకంగా తనే స్వయంగా అందంగా తీర్చిదిద్దుతుంది. క్రిస్మస్ ట్రీ చెయ్యడం నుంచి మొదలు పెడితే అన్ని తానే చేసుకుంటానని చెబుతుంది.
Also Read: మహేష్ తో మిడ్ నైట్ పార్టీ.. అందుకేనా ?
సమంత క్రిస్మస్ కోసం తన ఇంటిని అందంగా తీర్చిదిద్దుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. మరోవైపు, సమంత అటు టాక్ షో హోస్ట్ గా బిజీగా ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, చిరంజీవి, రానా, తమన్నా వంటి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన సామ్.. త్వరలోనే అల్లు అర్జున్ ను, అలాగే రామ్ చరణ్ ను కూడా టాక్ షోలో ఇంటర్వ్యూ చేయనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్