Homeఎంటర్టైన్మెంట్రొమాంటిక్ సీన్స్ కోసం సమంత తాపత్రయం !

రొమాంటిక్ సీన్స్ కోసం సమంత తాపత్రయం !

‘అక్కినేని సమంత’ స్పీడ్ మామూలుగా లేదు. తన మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’ కోసం సామ్ అప్పుడే డేట్లు ఇచ్చేసింది. నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్స్‌ లో షూటింగ్ ఆరంభం కానుంది. సామ్ ఈ నేల 25 నుండి షూట్ లో పాల్గొనబోతుంది. పైగా ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించబోతుంది. అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు […]

Samantha‘అక్కినేని సమంత’ స్పీడ్ మామూలుగా లేదు. తన మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’ కోసం సామ్ అప్పుడే డేట్లు ఇచ్చేసింది. నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్స్‌ లో షూటింగ్ ఆరంభం కానుంది. సామ్ ఈ నేల 25 నుండి షూట్ లో పాల్గొనబోతుంది. పైగా ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించబోతుంది.

అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంటుందట. మొత్తానికి తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా సామ్ ట్రీట్ చేస్తోంది. పైగా ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అందుకే ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ యాభై శాతం పూర్తయింది. అలాగే మరో రెండు షెడ్యూల్స్ తో కీలక సన్నివేశాలన్నీ పూర్తి కానున్నాయి.

ముఖ్యంగా ఈ నెలలో జరగబోయే షెడ్యూల్ లో సమంత, దేవ్‌ మోహన్‌ లకు సంబంధించిన ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సీన్స్ లో కాస్త రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని, ప్రేమలో పడిన తర్వాత జరిగే మొదటి కలయిక కాబట్టి, ఈ సంఘటన కారణంగా శాకుంతల తల్లి అవుతుందని, అందుకే గుణశేఖర్ కాస్త ఈ సీన్ ను బోల్డ్ గానే తీస్తారట. ఈ సీన్స్ బాగా రావాలని సమంత కూడా తెగ తాపత్రయ పడుతుందట.

ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజుతో కలసి గుణ శేఖర్‌ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి తెగ కష్టపడుతుంది. మరోపక్క తన కెరీర్‌ లోనే తొలిసారిగా చేస్తున్న మైథాలాజికల్‌ మూవీ కావడంతో సమంత కూడా ఈ సినిమాకి ఫుల్ కోపరేట్ చేస్తోంది. అందుకే లాక్‌ డౌన్‌ కి ముందు ఉన్న కోవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామ్ ఈ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంది. మళ్లీ కరోనా సెకెండ్ వేవ్ తగ్గకముందే ఈ నెలాఖరునే ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper