https://oktelugu.com/

Samajavaragamana Review: సామజవరగమన మూవీ రివ్యూ

కామెడీ చిత్రాలకు కథ అవసరం లేదు. సన్నివేశాలు, మాటలు నవ్వు పంచితే చాలు. ఈ సినిమా కథలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంది. కొడుకును తండ్రి చదివించడం, ఆ తండ్రి మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం భిన్నమైన పాయింట్. సాధారణంగా జరిగే పరిణామాలకు వ్యతిరేకం. ఈ పాయింట్ చుట్టూ చక్కని కామెడీ పంచడంలో దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడు.

Written By: , Updated On : June 28, 2023 / 03:04 PM IST
Follow us on

Samajavaragamana Review: శ్రీవిష్ణు- రెబ మోనికా జాన్ జంటగా నటించి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సామజవరగమన. సీనియర్ నరేష్ కీలక రోల్ చేశారు. ఈ మూవీ జూన్ 29న విడుదల కానుంది. అయితే ప్రత్యేక ప్రదర్శనలు వేయడం జరిగింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం…

కథ:

బాలు(శ్రీవిష్ణు)కు ప్రేమ అంటే పడదు. గతంలో ఎదురైన చేదు అనుభవం రీత్యా తాను నచ్చానని వెంటబడిన ప్రతి అమ్మాయి చేత రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. బాలుకు ఒక లక్ష్యం ఉంటుంది. అదేమిటంటే తండ్రి ఉమామహేశ్వరరావు (నరేష్) చేత డిగ్రీ పూర్తి చేయించాలి. అందుకు ఒక బలమైన కారణం ఉంటుంది. ఉమామహేశ్వరరావు డిగ్రీ పాసైతే మాత్రమే తన ఆస్తి దక్కేలా వాళ్ళ తాత వీలునామా రాసిపోతాడు. 30 ఏళ్ళ నుండి డిగ్రీ పూర్తి చేయడం నరేష్ వల్ల కాదు. సినిమా థియేటర్లో పని చేసే బాలు తండ్రిని అష్టకష్టాలు పడుతూ చదివిస్తూ ఉంటాడు. మరి బాలు లక్ష్యం నెరవేరిందా? ఉమామహేశ్వరరావు డిగ్రీ పాస్ అయ్యాడా? తాత కోట్ల ఆస్తి దక్కిందా? అనేదే సినిమా…

విశ్లేషణ:
కామెడీ చిత్రాలకు కథ అవసరం లేదు. సన్నివేశాలు, మాటలు నవ్వు పంచితే చాలు. ఈ సినిమా కథలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంది. కొడుకును తండ్రి చదివించడం, ఆ తండ్రి మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం భిన్నమైన పాయింట్. సాధారణంగా జరిగే పరిణామాలకు వ్యతిరేకం. ఈ పాయింట్ చుట్టూ చక్కని కామెడీ పంచడంలో దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడు.

తండ్రిని చదివించే క్రమంలో కొడుకు పడే పాట్లు, ట్యూషన్ సన్నివేశాలు, రఘుబాబు ప్రశ్నలు కడుపుబ్బా నవ్విస్తాయి. సమకాలీన విషయాలను ప్రస్తావిస్తూ రాసుకున్న పంచ్ డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు ఎలా మోసం చేస్తున్నారో తెలియజేస్తూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ అద్భుతంగా పేలింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్ గా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కామెడీతో పాటు అక్కడక్కడా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. సినిమా ఆద్యంతం నవ్వులతో సాగుతుంది. అయితే అక్కడక్కడ సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది. కొన్ని చోట్ల సాగతీతకు గురైంది. శ్రీవిష్ణు తన టైమింగ్ తో అదరగొట్టాడు. హీరోయిన్ రెబ మోనికా అటు గ్లామర్ పరంగా ఇటు కామెడీ పరంగా మెప్పించింది. నరేష్ ఈ చిత్రానికి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్:

కామెడీ
కథ
స్క్రీన్ ప్లే
ప్రధాన నటుల పెర్ఫార్మన్స్

మైనస్
అక్కడక్కడా విసిగించే సన్నివేశాలు
మ్యూజిక్

సినిమా చూడాలా? వద్దా?: కామెడీ మూవీ లవర్స్ కి సామజవరగమన పర్ఫెక్ట్ ఎంపిక. దర్శకుడు ఎలాంటి డబుల్ మీనింగ్స్ జోలికి పోకుండా క్లీన్ కామెడీతో ఆకట్టుకున్నాడు. శ్రీవిష్ణు, నరేష్ సినిమాకు హైలెట్ గా నిలిచారు.