https://oktelugu.com/

Ashu Reddy: ఫారిన్ వీధుల్లో అందాల దుకాణం తెరిచిన అషురెడ్డి… అమ్మడు గ్లామర్ కి షేక్ అవుతున్న సోషల్ మీడియా

ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంపై అషురెడ్డి స్పందించింది. ఆమె కొన్ని మీడియా సంస్థల మీద మండిపడింది. డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ లీక్ చేయడం వలన పలువురు ఫోన్స్ చేసి ఇబ్బందిపెడుతున్నారని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అరుదుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో తిరుగుతున్నాను. అనవసరంగా నా పేరు లాగి మానసిక వేదనకు గురి చేస్తున్నారు. సదరు మీడియా సంస్థల మీద నేను పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చరించింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2023 / 03:10 PM IST

    Ashu Reddy

    Follow us on

    Ashu Reddy: అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని కాంటాక్ట్ లిస్ట్ లో అషురెడ్డితో పాటు పలువురు టాలీవుడ్ సెలెబ్స్ పేర్లు ఉన్నాయి. నటి జ్యోతి, సురేఖావాణి, అషురెడ్డి అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరితో వందలసార్లు కేపీ చౌదరి ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. వీరికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదని ప్రచారం జరిగింది.

    ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంపై అషురెడ్డి స్పందించింది. ఆమె కొన్ని మీడియా సంస్థల మీద మండిపడింది. డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ లీక్ చేయడం వలన పలువురు ఫోన్స్ చేసి ఇబ్బందిపెడుతున్నారని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అరుదుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో తిరుగుతున్నాను. అనవసరంగా నా పేరు లాగి మానసిక వేదనకు గురి చేస్తున్నారు. సదరు మీడియా సంస్థల మీద నేను పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చరించింది.

    డ్రగ్ కేసు ఒకింత అషురెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఈమెకు ఆల్రెడీ సోషల్ మీడియాలో వ్యతిరేకత ఉంది. రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన బూతు ఇంటర్వ్యూలు, ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే బోల్డ్ ఫొటో షూట్స్ విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించిన నేపథ్యంలో నెటిజెన్స్ ఆమె మీద విరుచుకుపడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇవేమీ పట్టించుకోని అషురెడ్డి ఎప్పటిలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కొన్ని స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అషురెడ్డి ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అషురెడ్డి సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయ్యారు. టిక్ టాక్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఆమె మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. అనేక బుల్లితెర షోలలో అషురెడ్డి సందడి చేశారు.