https://oktelugu.com/

Tirumala: తిరుమల భక్తుల రద్దీపై కీలక సమాచారం

వేసవి సెలవుల్లో భారీగా భక్తుల రాక తిరుమలలో నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టోకెన్లు ఫిబ్రవరిలోనే పూర్తయిపోయాయి. విడుల చేసిన వెంటనే చాలా మంది బుక్ చేసేసుకున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. అత్యధికంగా ఒక్కో రోజు దాదాపుగా 90 వేల మందికి పైగానే దర్శనాలు చేసుకున్నారు. ఆ తరువాత మే, జూన్ నెలలకు టోకెన్లు విడుల చేసినా అదే పరిస్థితి నమోదైంది. కాగా, ప్రస్తుతం వేసవి సెలవులు ముగియడంతో శ్రీ వారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : June 28, 2023 / 02:54 PM IST

    Tirumala

    Follow us on

    Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని పరితపించిపోతుంటారు. కరోనా తరువాత ఆంక్షల నేపథ్యంలో పరిమితంగానే దర్శనాలకు అనుమతించారు. చాలా వరకు సేవలను రద్దు చేశారు. రెండు మూడేళ్ల నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. దీంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, వారం నుంచి భక్తుల రద్దీలో భారీగా మార్పు కనిపిస్తుంది.

    ప్రత్యేక దర్శనం, సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది. టీడీపీ ప్రత్యేక యాప్, వెబ్ సైట్ల ద్వారా బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే, టోకెన్లు పరిమితంగా ఉంటుండటంతో విడుల చేసిన వెంటనే వేగంగా బుక్కయిపోతున్నాయి. ఆన్ లైన్ పేమెంట్లు జరిగిన తరువాత కూడా చాలా మందికి రిజక్ట్ అవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి సర్వర్ హ్యాంగవడం వంటివి కూడా జరుగుతుంది. ఆఫ్ లైన్ లో అంటే తిరుమలలో టోకెన్ల జారీ పరిమితంగా ఉండటంతో అందరూ ఆన్ లైన్ టిక్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

    వేసవి సెలవుల్లో భారీగా భక్తుల రాక తిరుమలలో నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టోకెన్లు ఫిబ్రవరిలోనే పూర్తయిపోయాయి. విడుల చేసిన వెంటనే చాలా మంది బుక్ చేసేసుకున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. అత్యధికంగా ఒక్కో రోజు దాదాపుగా 90 వేల మందికి పైగానే దర్శనాలు చేసుకున్నారు. ఆ తరువాత మే, జూన్ నెలలకు టోకెన్లు విడుల చేసినా అదే పరిస్థితి నమోదైంది. కాగా, ప్రస్తుతం వేసవి సెలవులు ముగియడంతో శ్రీ వారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

    తిరుపతి లో భక్తుల రద్దీ మంగళవారం 69,143 మంది దర్శించుకున్నారు. ఇది గత రోజులతో పోల్చుకుంటే బాగా తగ్గినట్లే. అంతకు ముందు వారాల్లో 80 నుంచి 90 వేల మంది వరకు శ్రీవారి దర్శనాలకు వచ్చినట్లు టీటీడీ తన వెబ్ సైట్ పేర్కొంది. సర్వదర్శనం కోసం భక్తుల గంటల కొద్దీ కంపార్ట్ మెంట్లలో వేచి చూసేవారు. ప్రస్తుతం 3 గంటల్లో పూర్తయిపోతోంది. కేవలం ఒక కంపార్ట్ మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం భక్తుల తాకిడి మరింత తగ్గవచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.