Saloni: సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాములు విషయం కాదు ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తా అంటే మొదట ఇంట్లో వాళ్లే వద్దు అని చెప్తారు.పేరెంట్స్ కి సినిమా ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్ ఉండదు. అందుకే అబ్బాయిలని కూడా సినిమా ఇండస్ట్రీ కి వెళ్తాను అంటే చాలా మంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. ఇక అబ్బాయిలకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక అమ్మాయిల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు….
కానీ ఇలాంటి వాటన్నింటిని దాటుకొని కొంతమంది అమ్మాయిలు వచ్చి ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు…అలాంటిది కొంతమంది కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు అంటే ఇంకా వాళ్ల గురించి చాలా గొప్పగా చెప్పాలి. ఒక సినిమా తో ఆగిపోకుండా వరుసగా సినిమాల్లో చేస్తూ ఇండస్ట్రీ లో హీరోయిన్లు గా ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే కొందరు మాత్రం అందం, అభినయం రెండు ఉన్న కూడా ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవుతున్నారు అలాంటి వాళ్లలో సలోని ఒకరు.ఈమె 1987 వ సంవత్సరం లో మహారాష్ర్ట లో జన్మించింది.
అందం అభినయం రెండు కలగలిపిన రూపం తనది దాంతో ఆమె కి సినిమాల్లో ఈజీ అవకాశం వచ్చింది అందులో భాగంగానే ఈమె 2003 లో పరదేశి హో గయ అనే సినిమాతో హిందీ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత గా ఆడకపోయేసరికి ఆమె కి అక్కడ పెద్ద అవకాశాలు అయితే రాలేదు ఇక దాంతో తెలుగు లో తరుణ్ హీరో గా, రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఒక ఊరిలో మొదలైన ప్రేమకథ అనే సినిమాతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. ఇక దాంతో ఆమె సుమంత్ హీరో గా వచ్చిన ధన 51 సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు దాంతో ఆమె మగధీర సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది…
ఇక ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సునీల్ ని హీరోగా పెట్టీ తీసిన మర్యాద రామన్న అనే సినిమాలో తను హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక దాంతో ఈమె కి అవకాశాలు ఫుల్ గా వస్తాయి అని అందరూ అనుకున్నారు కానీ అసలు ఈమె కి ఒక్క పెద్ద సినిమాలో కూడా అవకాశం రాలేదు. దాంతో వచ్చిన కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అవేమీ పెద్దగా గుర్తింపు తీసుకు రాకపోవడం తో సినిమాల్లో అవకాశాలు లేక ఆమె ఫేడ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది ఇక ప్రస్తుతం ఆమె ముంబై లో ఉంటుంది…ఇక ఏదైనా మంచి పాత్ర దొరికితే తెలుగులో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి కూడా రెఢీ గా ఉంది…
View this post on Instagram