Homeఅంతర్జాతీయంIndia Vs Canada: కెనడాతో దౌత్య యుద్ధం: భారత్‌లో హాట్‌ టాపిక్‌గా ఎర్రపప్పు

India Vs Canada: కెనడాతో దౌత్య యుద్ధం: భారత్‌లో హాట్‌ టాపిక్‌గా ఎర్రపప్పు

India Vs Canada: ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా, భారత్‌ మధ్య దౌత్య యుద్ధం మొదలయింది. ఇరు దేశాలూ దౌత్యాధికారులను బహిష్కరించుకు న్నాయి. పరస్పరం మాటల యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కెనడా అధ్యక్షుడు ట్రూడో చేస్తున్న వ్యాఖ్యలు ఇరు దేశాల దౌత్య సంబంధాల మీద మరింత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత్‌, కెనడా మధ్య దౌత్య యు ద్ధం నేపథ్యంలో గతవారం నుంచి భారత్‌కు కెనడా నుంచి పప్పుల దిగుమతులు మందగించాయి. దీని వల్ల కెనడాలోని రైతులకు పప్పుల ధరల్లో కోతపడే ప్రమాదం ఉంది. మరోవైపు భారతదేశంలో పప్పుల ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారే ప్రమాదమూ నెలకొంది. వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది రాజకీయంగా ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు.

మనదేశంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్రపప్పు వినియోగం అధికం గా ఉంటుంది. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఈ వాడకం ఎక్కువగా ఉంటుంది. కెనడా నుంచి అత్యధికంగా భారత్‌కు సరఫరా అవుతుంది. ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎగుమతి, దిగుమతులపై పరిమితులు విధించే ముప్పు ఉందని తెలుస్తోంది. అలాగే, భారత్‌తో వ్యాపార సంబంధాలపై నేరుగా ప్రభావం పడే చర్యలేమీ ప్రస్తుతం కెనడా తీసుకోలేదని కెనడా అంతర్జాతీయ వ్యవహారాల విభాగం బాధ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో పంట దిగుబడులు రాగానే భారతీయ వ్యాపారులు కెనడా నుంచి భారీస్థాయిలో ఎర్రపప్పును కొనుగోలు చేశారు. అయితే, అప్పటితో పోలిస్తే.. నిజ్జర్‌ హత్యపై ట్రూడో వ్యాఖ్యల అనంతరం కెనడాలో ఎర్రపప్పు ధర 6% పడిపోయింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కెనడా నుంచి 4,85,495 టన్నుల(రూ.3,079 కోట్ల విలువ) ఎర్రపప్పు భారత్‌కు సరఫరా అయ్యింది. ఇది భారతదేశ ఎర్రపప్పు మొత్తం దిగుమతుల్లో సగం కంటే ఎక్కువే.

గతేడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 1,90,784 టన్నుల ఎర్రపప్పు కెనడా నుంచి భారత్‌కు దిగుమతి కాగా, ఈ ఏడాది అదే కాలానికి కెనడా నుంచి ఎర్రపప్పు దిగుమతి 420 % పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలియజేస్తున్నా యి. భారత్‌లో ఏటా సుమారు 24 లక్షల టన్నుల ఎర్రపప్పును వినియోగిస్తుండగా, స్థానికంగా ఉత్పత్తి అయ్యేది 16 లక్షల టన్నులు మాత్రమే. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గతేడాదిగా భారత్‌లో ఎర్రపప్పు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతోపాటు కెనడాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇతరదేశాల నుంచి కూడా ఎర్రపప్పు దిగుమతులు చేస్తోంది. ఈ ఏడాది భారత్‌కు ఎర్రపప్పు ఎగుమతుల్లో కెనడాను ఆస్ర్టేలియా అధిగమించేసింది. భారత్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కెనడా నుంచి 95 వేల టన్నుల ఎర్రపప్పును దిగుమతి చేసుకోగా, అదే స మయంలో ఆస్ర్టేలియా నుంచి 1.99 లక్షల టన్నులు దిగుమతి చేసుకొంది. మరోవైపు ప్రభుత్వం ఎర్రపప్పుపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆస్ర్టేలియా, రష్యా దృష్టి సారించాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular