https://oktelugu.com/

Salman Khan: ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్…

Salman Khan: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమం లోనే నిన్న ముంబైలో ఘనంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 02:18 PM IST
    Follow us on

    Salman Khan: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమం లోనే నిన్న ముంబైలో ఘనంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

    ఈ వేడుకలో సల్మాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం సల్మాన్ మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‏లను పొగడ్తలతో ముంచేత్తారు. ఈ క్రమంలోనే అభిమానులకు మరో శుభవార్త అందించారు సల్మాన్ భాయ్. సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు సల్మాన్.

    బజరంగీకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్… ఈ సీక్వెల్ చిత్రానికి కూడా కథ అందిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. బజరంగీ భాయిజాన్ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. పాకిస్థాన్‏కు చెందిన ఓ మూగ చెవిటి చిన్నారిని తన కన్నవారి వద్దకు చేర్చేందుకు భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.