https://oktelugu.com/

Sai Pallavi: సాయి పల్లవి… నువ్వు మరీ అంత సెన్సిటివ్ ఏంటమ్మా!

Sai Pallavi: ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి చాలా ప్రత్యేకం. కాసుల కోసం కక్కుర్తి పడే రకం కాదు. కథలో విషయం ఉంటేనే సినిమా చేస్తారు. గ్లామర్ ఫీల్డ్ లో కూడా తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఆమె అతిక్రమించరు. సాయి పల్లవి చేసిన ప్రతి చిత్రంలో ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. ఆరు పాటలు, నాలుగు సీన్స్ తో సినిమా లాగించేస్తా అంటే, ఆమె విషయంలో కుదరదు. హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 20, 2021 / 02:23 PM IST
    Follow us on

    Sai Pallavi: ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి చాలా ప్రత్యేకం. కాసుల కోసం కక్కుర్తి పడే రకం కాదు. కథలో విషయం ఉంటేనే సినిమా చేస్తారు. గ్లామర్ ఫీల్డ్ లో కూడా తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఆమె అతిక్రమించరు. సాయి పల్లవి చేసిన ప్రతి చిత్రంలో ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. ఆరు పాటలు, నాలుగు సీన్స్ తో సినిమా లాగించేస్తా అంటే, ఆమె విషయంలో కుదరదు. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటే.. దర్శకులకు గుర్తొచ్చే పేరు సాయి పల్లవి.

    Sai Pallavi

    సాయి పల్లవి ప్రత్యేకతలు చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. కమర్షియల్ యాడ్స్ కి సాయి పల్లవి చాలా దూరం. కోట్లు ఆఫర్ చేసినా తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనంటారు. ఆ మధ్య ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవికి భారీ ఆఫర్ ఇచ్చారట. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని కోరారట. అయితే ఈ ఆఫర్ ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించారని సమాచారం.

    ప్లాప్ అయిన సినిమా నిర్మాతలకు డబ్బులు వెనక్కి తిరిగిచ్చారన్న పుకార్లు కూడా పరిశ్రమలో చక్కర్లు కొట్టాయి. సాయి పల్లవికి ఉన్న మరో మంచి లక్షణం ఆమె చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకు కూడా ఆమె ఎమోషనల్ అయిపోతారు. ఇటీవల జరిగిన శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. సాయి పల్లవి మౌత్ అందుకోగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమె పేరుతో ఆడిటోరియం మారుమ్రోగి పోయింది. ఆ స్పందనకు ఏమి మాట్లాడాలో కూడా సాయి పల్లవికి అర్థం కాలేదు. ఆమె టెంప్ట్ అయిపోయారు.

    ఈ మూడ్ లో ఆమె ఏదేదో మాట్లాడేశారు. అలాగే బిగ్ బాస్ ఫినాలేకి స్పెషల్ గెస్ట్స్ లో ఒకరిగా వచ్చిన సాయి పల్లవి శ్రీరామ్ ఎలిమినేషన్ కి చాలా బాధపడ్డారు. ఎలిమినేషన్ తర్వాత అతన్ని ఓదార్చి, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సాయి పల్లవి తీరు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈమెది ఇంత ప్యూర్ హార్ట్ ఏంట్రా బాబు అంటూ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: Salman Khan: ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్…

    అసలు ఇంత సెన్సిటివ్, ఓపెన్ మైండెడ్ గా ఉండి సాయి పల్లవి పరిశ్రమలో ఎలా సక్సెస్ అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సున్నితంగా ఉండేవారు అసలు రాణించలేరు. ఎందుకంటే తప్పున్నా లేకున్నా కొన్ని సార్లు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖస్తుతి, లౌక్యం చాలా అవసరం. సాయి పల్లవి వీటన్నింటికి అతీతంగా రాణిస్తూ… తాను చాలా ప్రత్యేకమని నిరూపించుకుంటుంది.

    Also Read: Bollywood: బాలీవుడ్ లో మరో కలకలం… ఐశ్వర్య రాయ్ కి ఈడీ సమన్లు

    Tags