Salman Khan: నిన్నటి నుండి సోషల్ మీడియా లో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన లేటెస్ట్ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కందుల వీరుడిగా పిలవబడే సల్మాన్ ఖాన్ , ఇలా పోయారేంటి?, ఆయన ఆరోగ్యం సరిగానే ఉందా?, లేదంటే ఏమైనా తేడా జరిగిందా ?, అసలు భాయ్ కి ఏమైంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు , విశ్లేషకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన కాసేపటి క్రితమే క్లారిటీ ఇస్తూ , ఒక సంచలన ట్వీట్ వేశారు. ‘హాయ్.. మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటూ ఆయన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వేసిన ట్వీట్ సంచలనం గా మారింది. తన పై వచ్చిన రూమర్స్ కి వెటకారంగా సల్మాన్ ఖాన్ వేసిన ఈ ట్వీట్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే వరుసగా రెండు దశాబ్దాల వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలుతూ వచ్చిన సల్మాన్ ఖాన్ , కరోనా లాక్ డౌన్ తర్వాత బాగా డౌన్ అయ్యారు. ఆయన నటించిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఓపెనింగ్స్ లో సల్మాన్ ఖాన్ ని కింగ్ అని పిలిచేవారు , కానీ లాక్ డౌన్ తర్వాత ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దీంతో ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కానీ సల్మాన్ ఖాన్ ఎలాంటి సూపర్ స్టార్ అనేది ఎవ్వరూ మర్చిపోకూడదు. సరైన సినిమా పడితే , నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా వేల కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొడుతున్నారు , అలాంటిది సల్మాన్ ఖాన్ తన రేంజ్ కి తగ్గ హిట్ కొడితే ఏ రేంజ్ వసూళ్ల సునామీ క్రియేట్ అవుతుందో మీరే ఊహించుకోండి.
ఇకపోతే ప్రస్తుతం ఆయన అపూర్వ లఖియా దర్శకత్వం లో ‘మాతృ భూమి’ అనే చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటుగా ఆయన మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . వచ్చే ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ కం బ్యాక్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K
— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026


