Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథతో మరొక హీరో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో కొంతమంది ఇతర భాషల హీరోలు ఆ సినిమాకు సెట్ అవుతారని రచయితలను వాళ్ళను ఊహించుకుంటూ రాసుకున్న కథలను ఆ హీరోలు కాదనడంతో మరొక భాషలోని ఒక హీరోతో చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ రైటర్ గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న ‘విజయేంద్ర ప్రసాద్’ రాసిన ఒక కథని మొదటగా ‘రజనీకాంత్ ‘ కి వినిపించారట. రజనీకాంత్ అప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉండటం వల్ల ఆ సినిమాని అప్పటికప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో తన ఫేలయ్యాడు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి తను తప్పుకున్నాడు. ఇక ఆయన తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో దిగ్గజ నటుడిగా పేరు పొందిన ‘కమల్ హాసన్ ‘ దగ్గరికి ఆ కథ వెళ్ళింది. కమల్ హాసన్ కూడా కథను రిజెక్ట్ చేయడంతో వీళ్ళిద్దరిని కాదని బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ దగ్గరికి విజయేంద్రప్రసాద్ ఒక కథను తీసుకెళ్లాడు.
ఇక ఆ కథ ఆయనకు బాగా నచ్చడంతో ‘భజరంగీ భాయిజాన్’ అనే సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్ళారు. ఇక ఈ సినిమా సక్సెస్ ని సాధించడమే కాకుండా రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకోవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది…
బాహుబలి సినిమాతో గొప్ప రైటర్ గా పేరు సంపాదించుకున్న విజయేంద్రప్రసాద్… ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి… రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ నటులు రిజెక్ట్ చేసిన కథతో సల్మాన్ ఖాన్ సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని కూడా క్రియేట్ చేసింది.
ఇక మొత్తానికైతే కండల వీరుడు ఈ కథను నమ్మి సినిమా చేయడం అతని కెరియర్ కి కూడా చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. అలా కొన్ని కథల్ని కొంతమంది స్టార్ హీరోలు మిస్ అవుతూ ఉండడం వల్ల అవి ఇంకొక హీరోకి చాలా వరకు ప్లస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఈ సినిమాని కమల్ హాసన్ గాని, రజినీకాంత్ గాని చేసి ఉంటే వాళ్ల కెరియర్ లో భారీ సక్సెసులు అయితే వచ్చుండేది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…