https://oktelugu.com/

October Month Festivals : అక్టోబర్ నెలలో దసరాతో పాటు మరికొన్ని పండుగలు ఉన్నాయ.. అవేంటంటే?

ఈసారి అక్టోబర్ లో బతుకమ్మ, దసరానే కాకుడా మరిన్ని పండుగలు రాబోతున్నాయి. ఇవి జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. మరి అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ఏవో చూద్దాం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2024 / 11:54 AM IST

    October Month Festivals

    Follow us on

    October Month Festivals :  శ్రావణమాసం ప్రారంభమైన తరువాత వరుసగా పండుగలు వస్తుంటాయి. ఇందులో అక్టోబర్ నెలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా. ఈ నేపథ్యంలో ఈ పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. బతుకమ్మ ఆటలతో పాటు దుర్గాదేవికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే ఈసారి అక్టోబర్ లో బతుకమ్మ, దసరానే కాకుడా మరిన్ని పండుగలు రాబోతున్నాయి. ఇవి జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. మరి అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ఏవో చూద్దాం..

    అక్టోబర్ నెలలో దసరా కంటే ముందే పితృపక్షాలు ప్రారంభం అవుతాయి. కొందరు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు. కుటుంబంలో మరణించిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవే కాకుండా ఈ నెలలో అశ్విన్ అమావాస్య, శరద్ నవరాత్రి, కల్పరంభ్, నవపత్రిక పూజ, దుర్గా మహా నవమి పూజ, దసరా, దుర్గా నిమజ్జనం, పాపాంకుష ఏకాదశి, ప్రదోష వ్రతం, నెలవారి శివరాత్రి, నరక చతుర్ధశి జరుపుకుంటారు.

    వీటిలో అక్టోబర్ 11న దుర్గాష్టమి నిర్వహించుకోనున్నారు. ఆ తరువాత 12న దసరా పండుగను నిర్వహించుకుంటారు. ఇదే నెలలో శివుడిని ఆరాధిస్తూ చేసే ప్రదోష వ్రతం కూడా రానుంది. శివుడు, పార్వతి దేవీల ఆనందం కోసం ఈ వ్రతం నిర్వహిస్తారు. హిందూ క్యాలెకండర్ ప్రకారం ప్రతీ పక్షం రోజుల్లో 13వ రోజున ద్వైమాసిక కాలాన్ని ప్రదోషం అంటారు. ఇది సూర్యాస్తమానికి 1.5 గంల ముందు 3 గంటల లోపు శివుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని అంటారు. ఈ వ్రతాలు నిర్వహించే సమయంలో భక్తులు ఉపవాసాలతో ఉంటారు. అయితే ఈ వ్రతాలు కొందరు మాత్రమే చేస్తారు. వీరితో పాటు దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొనే వారు భవాని మాలను ధరిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారి సేవలోనే ఉంటారు.

    దుర్గాదేవి నవరాత్రోల్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బాలత్రిపుర సుందరి, మూడో రోజు గాయత్రీ దేవి, నాలుగో రోజు లలితా దేవి, ఐదో రోజు అన్నపూర్ణ దేవి, ఆరో రోజు మహాలక్ష్మీ, ఏడో రోజు దుర్గా దేవి, ఎనిమిదో రోజూ మహిషాసుర మర్ధిని, తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తారు. పదో రోజు అమ్మవారి విగ్రహాలను సమీప చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు.

    ఇక ఇదే నెలలో దీపావళి కూడా రానుంది. అక్టోబర్ 31న దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఇదే రోజును నరక చతుర్ధశి అని కూడా అంటారు. దీపావళి రోజున ప్రతి ఇల్లు కాంతివంతంగా మారుతుంది. లక్ష్మీపూజలు నిర్వహిస్తుంటారు. ఇంటిల్లి పాది కలిసి పూజలో పాల్గొంటారు. కొందరు వ్యాపారులు నిర్వహించేవారు తమ షాపుల్లో లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో ఈరోజంతా నిష్టతో ఉంటారు. సాధారణంగా దీపావళి నవంబర్ నెలలో వస్తుంటుంది. కానీ ఈసారి అక్టోబర్ లోనే రానుంది. దీంతో అక్టోబర్ నెల మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.