Pawan kalyan
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తనదైన రీతిలో పదవీ బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఏపీ లో జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడానికి పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నమైతే చేశాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలను తీర్చే ప్రయత్నంలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక తను గతంలో స్టార్ట్ చేసిన కొన్ని సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంది. కాబట్టి ఆ సినిమా షూటింగ్ లకు తను ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక ఇప్పటికే ఆయన సెట్స్ మీద మూడు సినిమాలు ఉంచాడు. ఇక మీదట ఈ సినిమాల షూట్ ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయాలని ఉద్దేశ్యంలో సినిమా నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి వస్తున్నాడు అంటూ కొన్ని ఫేక్ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈనెల 23వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు అంటూ కొంతమంది కొన్ని వార్తలు రాశారు.
నిజానికి 23వ తేదీన ఆయన షూట్ కి రావాలని అనుకున్నప్పటికీ ఆయనకు వీలయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందువల్లే ఆయన దసరా తర్వాత నుంచి సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో తొందరగా పాల్గొని ఆ సినిమాలన్నీ పూర్తి చేసి పూర్తిగా తబ కెయిటర్ ను జనానికి అంకితం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే అవకాశం దొరికినప్పుడు మాత్రం సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధం గా ఉంటానని కూడా చెబుతున్నాడు. ప్రస్తుతానికైతే సెట్స్ మీద ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి ఆయన దసరా తర్వాత నుంచి షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతలోపే కొంతమంది మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ను బ్యాడ్ చేసే విధంగా రాతలను రాస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.
ఇక మొత్తానికైతే సినిమా షూటింగ్ లో తొందర్లోనే పాల్గొని ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేసి కొద్దిరోజుల పాటు జనానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇకమీదట ఆయన ఎలాంటి కసరత్తులు చేస్తూ ఇటు సినిమాని, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తాడు అనేది…