Natural Star Nani Name
Natural Star Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, పెద్ద స్టార్ హీరో గా మారిపోవడం వంటివి చూసి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాము. ఎందుకంటే వారిలో మనల్ని చూసుకుంటాము కాబట్టి. వాళ్ళ ఎదుగుదల మన ఎదుగుదల లాగా భావిస్తాము కాబట్టి. అలా చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు. వారిలో ఒకరు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ఈయన తన కెరీర్ ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రావు, కృష్ణ వంశీ, తేజా ఇలా ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ వద్ద ఈ ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అదే లైన్ లో వెళ్లుంటే నేడు ఈయన పెద్ద డైరెక్టర్ అయ్యేవాడేమో. కానీ సురేష్ బాబు ఇతన్ని ‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా హీరో గా ఆడియన్స్ కి పరిచయం చేసాడు.
ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా నాని ని చూసిన ప్రతీ ఒక్కరు ఎవరీ కుర్రాడు, ఇంత బాగా నటిస్తున్నాడు, చాలా అందంగా కూడా ఉన్నాడు అంటూ అప్పట్లో అనుకునేవారు. డైరెక్టర్స్ కి కూడా అలా అనిపించడంతో నాని కి పక్కింటి కుర్రాడి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసారు డైరెక్టర్స్. అవి ఆయనకు బాగా సెట్ అయ్యాయి. ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. అలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన నాని, నేడు వరుసగా వంద కోట్ల గ్రాస్ సినిమాలను కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగిపోయాడు. ఓవర్సీస్, నైజాం ఆడియన్స్ కి నాని ఒక స్టార్ హీరో అనొచ్చు. జీరో నుండి ఈ స్థాయికి ఎదిగిన నాని సినీ ప్రస్థానం కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే నాని అసలు నాని కాదు. ఇండస్ట్రీ కి రాకముందు అతని పేరు నవీన్ కుమార్ అట. షార్ట్ కట్ గా ఉండేందుకు నాని గా తన పేరు ని మార్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన అందుకున్న మొట్టమొదటి రెమ్యూనరేషన్ అక్షరాలా నాలుగు వేల రూపాయిలు. అలా కెరీర్ ని మొదలు పెట్టిన నాని, నేడు పాతిక నుండి 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకునే హీరో గా ఎదిగాడు. ఇది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో నాని స్టార్ హీరోల లీగ్ లోకి చేరి, వంద కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకునే స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్ 3′(Hit: The Third Case) టీజర్ ని విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నాని నుండి ఈ స్థాయి రక్త పాతం ఊహించలేదని, ఇది ఆయన కెరీర్ బెస్ట్ యాక్షన్ మూవీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.