Salaar OTT: ఓటీటీలో సలార్ ప్రభంజనం… ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా షేక్

సలార్ విడుదలై నాలుగు వారాలు పూర్తి అయింది. దీంతో ఓటీటీలో విడుదల చేశారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో సలార్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

Written By: S Reddy, Updated On : January 27, 2024 5:15 pm
Follow us on

Salaar OTT: గత ఏడాది చివర్లో వచ్చి మెరుపులు మెరిపించాడు ప్రభాస్. ఆయన లేటెస్ట్ మూవీ సలార్ బాక్సాఫీస్ షేక్ చేసింది. 2023 డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 2023కి గాను హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డును సలార్ సొంతం చేసుకుంది. రూ. 178 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. రన్ ముగిసే నాటికి సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. సలార్ మూవీతో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కారు. వరుస పరాజయాల నుండి బయటపడ్డారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ తెరకెక్కించారు .

కాగా సలార్ విడుదలై నాలుగు వారాలు పూర్తి అయింది. దీంతో ఓటీటీలో విడుదల చేశారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో సలార్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఫ్యాన్సీ ధర చెల్లించి సలార్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న నేపథ్యంలో భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇండియా వైడ్ సలార్ నెట్ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.

అన్ని భాషల్లో సలార్ కి ఆదరణ దక్కుతుంది. ఓటీటీలో కూడా ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ క్రమంలో #salaargoesglobal అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మూవీ విడుదలై నెల రోజులు దాటిపోయినా సలార్ మేనియా జనాల్లో తగ్గలేదు. అందుకు ఇది నిదర్శనం. సలార్ ఇద్దరు మిత్రుల కథగా తెరకెక్కింది. ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ బెస్ట్ ఫ్రెండ్ రోల్స్ లో నటించారు. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చే దేవాగా ప్రభాస్ రోల్ గూస్ బంప్స్ రేపింది.

కాగా సలార్ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంది. అసలు కథ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 కోసం దాచి ఉంచాడు. సీక్వెల్ లో ఫ్రెండ్ మధ్య పోరు నడుస్తుంది. పార్ట్ 1 కి మించి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. కాబట్టి సలార్ 2 భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. సలార్ లో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటించింది. జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక రోల్స్ చేశారు. కెజిఎఫ్ నిర్మాతలు రూపొందించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.