Prashanth Neel: ప్రభాస్ కెరీర్లో సలార్ మరొక బిగ్గెస్ట్ హిట్ అనడంలో సందేహం లేదు. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిజానికి సలార్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. కాగా సలార్ మూవీ ఉగ్రం చిత్ర రీమేక్ అనే ప్రచారం జరిగింది. ఉగ్రం 2014లో వచ్చిన కన్నడ చిత్రం. దర్శకుడు ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ. ఉగ్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీ విడుదలైన నాలుగేళ్లకు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రం చేయడం జరిగింది.
కాగా సలార్ ఉగ్రం రీమేక్ అనే వాదనను ప్రశాంత్ నీల్ ఒప్పుకోవడం విశేషం. సలార్ ఉగ్రం రీమేక్ అంటున్నారు. ఉగ్రం నేను తెరకెక్కించిన చిత్రం. ఆ కథను నేను మరలా చెప్పాలి అనుకున్నాను. నా లోతైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నాను. సలార్ మూవీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండిపోవాలి. నేను అదే కోరుకున్నాను… అని ప్రశాంత్ నీల్ అన్నారు. కాబట్టి సలార్ మూవీ ఉగ్రం స్టోరీనే. కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కి పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లు మార్పులు చేశారు.
అయితే ఉగ్రం మూవీ గురించి ఎవరికీ తెలియదు. అది కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన చిత్రం. కాబట్టి సలార్ మూవీ ఇతర భాషా ప్రేక్షకులకు ఫ్రెష్ గానే ఉంటుంది. ఇక సలార్ కథ విషయానికి వస్తే… దేవ-వరదరాజు అనే ఇద్దరు మిత్రుల మధ్య అనుబంధం. దేవగా ప్రభాస్ నటించాడు. వరదరాజు పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. వరదరాజు వన్ మ్యాన్ ఆర్మీగా ప్రభాస్ పాత్ర ఉంది.
ఇక సలార్ కి పార్ట్ 2 కూడా ఉంది. అసలు కథ సీక్వెల్ లో ప్రశాంత్ వర్మ చెప్పనున్నాడు. మొదటి భాగంలో కొన్ని పాత్రలను కేవలం పరిచయం చేసి వదిలేశారు. కథ అసంపూర్తిగా చెప్పడం కూడా సలార్ కి కొంచెం మైనస్ అయ్యింది. సలార్ 2లో ప్రాణమిత్రులు కాస్త బద్ధ శత్రువులు అవుతారట. ప్రధాన పోరు ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య నడుస్తుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పారు. సలార్ 2 పై భారీ హైప్ నెలకొని ఉంది.