Saiyaara Movie Collections: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. దానికి తోడుగా ఇతర భాషల హీరోల సినిమాలు బాలీవుడ్లో రాజ్యమేలుతుండడం వల్ల బాలీవుడ్ హీరోల క్రేజ్ కూడా అంతకంతకు పడిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సైయారా (Saiyaara) అనే సినిమా వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీని పైకి లేపే ప్రయత్నం అయితే చేస్తుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 300 కోట్ల మార్కు ను చేరుకుంటుంది అంటూ సినిమా మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలు ఇంత చిన్న సినిమా ఇంతటి భారీ వసూళ్లను రాబట్టడానికి గల కారణం ఏంటి అసలు ఈ సినిమాలో ఏముంది అంటూ చాలామంది చాలా రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. నిజానికి ఈ సినిమాలో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ అయితే ఉంది. స్టోరీ చూడ్డానికి పాతదే అయినప్పటికి దర్శకుడు మోహిత్ సూరి స్క్రీన్ పైన చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు.స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకొని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథను మలచడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. దాన్ని స్క్రీన్ మీద చాలా ప్లజెంట్ గా ప్రజెంట్ చేయడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ ని సాధించాడు. మొత్తానికైతే ఒక రొటీన్ కథకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే ని రాసుకొని ఎమోషన్స్ తో కూడిన ఎండింగ్ ఇచ్చి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. సినిమాలో హీరో హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేసే సీను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఒక్క సీన్ కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సెన్సిబిలిటి లవ్ స్టోరీ ఎప్పుడు వచ్చినా కూడా దానికి మంచి ఆదరణ దక్కుతుందని చెప్పడానికి ఈ సినిమాని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.
Also Read: అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కథేంటో తెలిసిపోయిందిగా…
అయితే హీరో హీరోయిన్ ని ప్రేమించుకున్న తర్వాత అనుకోకుండా హీరోయిన్ గతం మర్చిపోవడం ఆ తర్వాత ఇంకొక అబ్బాయి ని లవ్ చేయడం తిరిగి హీరోని మళ్లీ ఎలా గుర్తుపట్టింది.వీళ్లిద్దరూ కలిసారా లేదా అనే కథతో ఈ సినిమా వచ్చింది.
అయితే ఇలాంటి కథతో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినప్పటికి ఆ సినిమాల్లో లేనిది ఈ సినిమాల్లో ఉంది ఏంటి అంటే ప్రజెంటేషన్ అనే చెప్పాలి. దర్శకుడు స్క్రీన్ మీద కథను చెప్పిన విధానం బాగుంది. ప్రతి షాట్ చాలా కొత్తగా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది.అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు చాలా హార్ట్ ఫుల్ గా వర్క్ చేసినట్టుగా అనిపించింది.
Also Read: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్టర్ ..రామ్ చరణ్ ను ఏదో చేసేలానే ఉన్నాడే..!
అందువల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక మహేష్ బాబు సుకుమార్ లాంటి దిగజాలు సినిమా గురించి ట్వీట్ చేయడం కూడా ఈ సినిమాకి బాగా కలిసివచ్చింది…ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్రాణం పోసింది. విజువల్స్ అద్భుతంగా కుదిరాయి మొత్తానికి అన్ని క్రాఫ్ట్ లు వాళ్ళు వాళ్ళ పనిని పెర్ఫెక్ట్ గా చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమాని ఉదాహరణగా తీసుకోవచ్చు…