NTR-Sai Pallavi: ఎన్టీఆర్ కు ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. వాస్తవాలు సంగతి దేవుడెరుగు, రూమర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు, నెటిజన్లు పోటీ పడి మరీ, ఆ పుకారును ఊరూరా తిప్పుతూ వైరల్ చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – సాయిపల్లవి కలయిక కూడా ఇలాగే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రాబోతుంది.

ఇప్పటికే కొరటాల శివతో పాటు నిర్మాతలు కూడా సాయి పల్లవితో ఈ సినిమా పై చర్చించారు. ఎన్టీఆర్ – సాయి పల్లవి కలయికలో సినిమా అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే స్క్రీన్స్ షేక్ అయిపోతాయి. ఆ డ్యాన్స్ మూమెంట్స్ పై వచ్చే కామెంట్స్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. పైగా క్రేజీ హీరోయిన్ గా సాయిపల్లవి ఎంత పేరు ఉందో, మంచి నటిగా అంతే పేరు ఉంది.
Also Read: Pawan Kalyan with son Akira Nandan: పవన్ ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో.. ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ !
అందుకే, సాయి పల్లవి, ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే.. ఆ సన్నివేశాలకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. త్వరలోనే ఈ న్యూస్ కి సంబంధించి అప్ డేట్ రానుంది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన ఈ వీడియోలో భారీ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. సాగర తీరంలో ఎన్టీఆర్ శత్రువులను ఊచకోత కొస్తుండగా ఆ రక్తపు ధారలకు కెరటాలు ఎరుపెక్కాయి.
దుర్మార్గుల అరాచకాలు ఎక్కువై సామాన్యుడి సహనం నశిస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో.. చెప్పడమే ఈ సినిమా థీమ్ లా ఈ వీడియో సాగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్ మెయిన్ హైలైట్. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.
Also Read:Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి కమిట్‌మెంట్ గురించి చెప్పింది
[…] Also Read: NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగ… […]
[…] Also Read:NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగ… […]