Chiranjeevi-Saikumar : చిన్న సినిమాలను ప్రోత్సహించడంలోనూ, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను వెన్నుతట్టి పైకి తీసుకొని రావడంలోనూ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి ని మించిన వారు లేరు. ఎంతో ఓపికతో తన వల్ల ఒక చిన్న సినిమాకి మేలు జరుగుతుంది అనుకుంటే, గంటలు తరబడి ఆ సినిమా కోసం మాట్లాడేందుకు ఇష్టపడతాడు చిరంజీవి. ఇది వరకు ఆయన ఎన్నో సార్లు ఇది చేసి చూపించాడు. అయితే ఒకప్పుడు చిరంజీవి ఇతర హీరోలకు వీడియో బైట్స్ ఇచ్చేందుకు పెద్దగా ఇష్టం చూపేవాడు కాదట. ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ చెప్పుకొచ్చాడు. సాయి కుమార్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోలీస్ స్టోరీ’. ఇందులో ఆయన పలికిన ఒక్కొక్క డైలాగ్, ఒక్కో ఆణిముత్యం లాంటిది.
ఇప్పటికీ ఆ డైలాగ్స్ ని వాడుతూనే ఉంటారు. ‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే, ఆ కనిపించని నాల్గవ సింహమే రా పోలీస్’ అంటూ ఆయన చెప్పిన ఈ డైలాగ్ వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ముఖ్యంగా ఇలాంటి డైలాగ్స్ కి పోలీసులు ఎంతో గర్వపడుతారు. ఈమధ్య కాలంలో అనేక మంది హీరోలు పోలీసులను విలన్స్ గా, కమెడియన్స్ గా చూపిస్తూ ఉంటారు. కానీ పోలీస్ సమాజానికి ఒక బ్యాక్ బోన్ లాంటి వాడు అనేది సినిమాల్లో చాలా తక్కువ మంది మాత్రమే చూపించారు. వారిలో సాయి కుమార్ కూడా ఒకడిగా నిలబడడం ఆయనకీ నిజంగా గర్వకారణమే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిరంజీవి దగ్గరకు వెళ్లి మీరు ఒక్క వీడియో బైట్ ఇస్తే నా సినిమాకి చాలా ఉపయోగ పడుతుంది అన్నయ్యా అని అన్నాను. నన్ను ఇబ్బంది పెట్టకు సాయి, ఈ పని నేను చేయలేను, చాలా బిజీ గా ఉన్నాను, అయినా ఒక సినిమాకి ఇలా బైట్స్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. నా తమ్ముడు మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి కూడా అల్లు అరవింద్ గారు ఒక బైట్ వీడియో ఇవ్వమంటే నేను ఇవ్వను అని చెప్పాను. సినిమాలో దమ్ముంటే నాలాంటి వాళ్ళ మాటలు అసలు అవసరం లేదు, ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. ఇప్పుడు నేను వీడియో బైట్ ఇచ్చాను అనుకో, నా అభిమానులు వెళ్లి సినిమా చూస్తారు, ఒకవేళ సినిమా బాగాలేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది’ అని చిరంజీవి అన్నాడు అట.
అప్పుడు సాయి కుమార్ ‘సరే అన్నయ్య..మీరు సినిమా చూసిన తర్వాతనే వీడియో బైట్ ఇవ్వండి’ అని అన్నాడట. అప్పుడు చిరంజీవి ‘బాగా ఇరకాటంలో పడేశావు రా..సరే కానీ’ అని అన్నాడట. అప్పట్లో నైజాం ప్రాంతం మొత్తం కలిపి కేవలం ఒక్క ప్రింట్ మాత్రమే తయారు చేయించాం, ఆ ప్రింట్ ని అన్నయ్య ఇంట్లో ఏర్పాటు చేసాము. షూటింగ్ చేసిన అన్నయ్య బాగా అలిసిపోయి అప్పుడే అలా కూర్చున్నాడు, మా సినిమా చూడడం మొదలు పెట్టాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేసారు, షో పూర్తి అయ్యాక నా భుజంపై చెయ్యి వేసి శబాష్ రా సాయి అని పొగిడాడు అంటూ సాయికుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.