https://oktelugu.com/

JR NTR : జూనియర్ ఎన్టీయార్ మోక్షజ్ఞ మధ్య గొడవలు ఉన్నాయా? ఫ్యూచర్ లో మోక్షజ్ఞ వల్ల ఎన్టీయార్ ఇబ్బంది పడాల్సి రావచ్చా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక స్థాయిలో నిలబెట్టిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సీనియర్ ఎన్టీయార్ అనే చెప్పాలి. ఆయన పక్క ఇండస్ట్రీల నుంచి ఎన్నో ఎదురు దెబ్బలను తిన్నాడు. అయినప్పటికి తెలుగు సినిమా స్థాయి ని భారతదేశం మొత్తం తెలిసేలా చేశాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 8, 2024 / 06:11 PM IST

    JR NTR-Mokshgna

    Follow us on

    JR NTR :  ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుండి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తన 30వ పుట్టినరోజు జరుపుకున్న మోక్షజ్ఞ… సినిమాకు సంభందించిన అప్డేట్ ను కూడా ఇచ్చారు. మోక్షజ్ఞ స్టిల్ ని రిలీజ్ చేసి తొందరలోనే సినిమా థియేటర్లోకి రాబోతున్నాడు అంటూ ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ, ఇప్పుడు జై హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మోక్షజ్ఞ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని మూటగట్టుకుని తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరిలో తను కూడా ఒకడిగా ఎదగబోతున్నాడు అనే విషయాన్ని ప్రేక్షకులందరికి కూడా చెప్పబోతున్నట్టుగా అర్థమవుతుంది…

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని వ్యతిరేకతలైతే ఏర్పడుతున్నాయి. కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు చంద్రబాబు నాయుడు కి దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. పొలిటికల్ క్యాంపెనింగ్ కూడా తను ఎక్కువగా రావడం లేదు.

    దానివల్లే బాలయ్య బాబు తన కొడుకుని స్టార్ హీరోగా మార్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు అంటూ వార్తలయితే వస్తున్నాయి. ఇక కొన్ని రోజులుగా మోక్షజ్ఞ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక ఆ ట్వీట్ తో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవనే క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఎన్టీఆర్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ మీద కొంతవరకు భయాందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఒకవేళ మోక్షజ్ఞ కనక స్టార్ హీరోగా రాణించినట్లయితే నందమూరి అభిమానుల్లో గాని టిడిపి కార్యకర్తల్లో గాని మోక్షజ్ఞ మీద భారీ క్రేజ్ అయితే ఏర్పడుతుంది. తద్వారా ఎన్టీయార్ ను ఎక్కువగా పట్టించుకునే అవకాశాలు కూడా లేకపోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ కొంతవరకు సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది… మరి అందరూ అనుకుంటున్నట్టుగానే మోక్షజ్ఞ స్టార్ హీరోగా రాణిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…