Painkiller VS Beer : ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు, వ్యాపారులు తమ విధులతో నిత్యం బిజీగా ఉంటారు. కొందరు హార్డ్ వర్క్ చేస్తే.. మరికొందరు సాఫ్ట్ వర్క్ తో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే సాయంత్రం కాగానే అలసిన మనసుతో ఇంటికి వచ్చిన వారు టీవీలు, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. కానీ కొందరు ఒత్తిడి తట్టుకోలేని వారు.. శారీరకంగా ఎక్కువగా శ్రమ పడినవారు తమ అలసట తీరడానికి మద్యం సేవిస్తూ ఉంటారు. వీటిలో ఎక్కువగా బీరు తాగేవారు ఉంటారు. బీరు తాగడం వల్ల ఒత్తిడి నుంచి దూరమై గుండెకు మేలు చేస్తుందని కొందరి భావన. అయితే మద్యం అలవాటు లేని వారు శారీరక నొప్పుల నుంచి తట్టుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఈ క్రమంలో శరీరం రిలాక్స్ కావడానికి పెయిన్ కిల్లర్ పెట్టరా? లేక బీరు తాగడం మంచిదా? అనే సందేహం చాలామందికి వస్తోంది..
Also Read : అనుకోకుండానే ఆందోళనకు గురవుతున్నారా? ఇలా చేస్తే మనసు ప్రశాంతం..
కొన్ని సంవత్సరాల కిందట లండన్ లోని గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు ఈ సందేహంపై పరిశోధనలు చేశారు. పారాసెటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ తో పోలిస్తే బీరు తాగడం ఎంతో మంచిది అని చెప్పారు. రెండు గ్లాసుల బీరు తాగడం వల్ల మనసు ఉల్లాసంగా మారడమే కాకుండా ఎటువంటి నొప్పి అయినా తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు 400 మంది పై అధ్యయనం చేసి ఆ తర్వాత వివరాలు వెల్లడించారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తో పోలిస్తే ఒక గ్లాసు బీరు 25% అధికంగా నొప్పిని నివారిస్తుందని వెల్లడించారు.
అయితే ఏదైనా మోతాదుకు మంచిదే నష్టమే నన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కొందరు ఒత్తిడిని తట్టుకోవడానికి రెండు గ్లాసులు అని కాదు కనీసం 10 క్లాసుల వరకు తాగే వారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల శరీరం ఆల్కహాలకు గురై అనారోగ్యానికి గురవుతుంది. ఆ తర్వాత కిడ్నీ సమస్యలు వచ్చి మంచానికే పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల కేవలం పెయిన్స్ తొలగిపోవడానికి మీరు మాత్రమే తీసుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. సందర్భాన్ని బట్టి బీరు తాగచ్చు అని పేర్కొంటున్నారు.
ఇతర వ్యాధులు ఉన్నవారు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పెయిన్ కిల్లర్స్ పై రైతులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటివారు మద్యం సేవించడం కూడా అంతా మంచిది కాదని తెలుపుతున్నారు. బీరులో 0.08% ఆల్కహాల్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళితే అనేక అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతోంది.
అయితే రైతులను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ ను వాడడం కూడా మంచిది కాదని అంటున్నారు. పదేపదే పెయిన్ కిల్లర్స్ వాడిన మెదడుపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి అలవాటుగా మారి ఏవైనా నొప్పులు వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే తగ్గే అవకాశం ఉండదు. అందువల్ల ఈ రెండింటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలి.