https://oktelugu.com/

Saif Alikhan-Amruta Singh: అమృతతో తన వైవాహిక జీవితం గురించి మొదటి సారి చెప్పిన సైఫ్ అలీఖాన్.. కన్నీటితో ఏమన్నారంటే?

కరీనా కపూర్ తో వివాహం కంటే ముందు సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్యా మనస్పర్థలే విడిపోయేందుకు కారణం అని ఇటీవల ఇంటర్వ్యూలో సైఫ్ చెప్పుకచ్చాడు.

Written By:
  • Mahi
  • , Updated On : November 2, 2024 / 04:34 PM IST

    Saif Alikhan-Amruta Singh

    Follow us on

    Saif Alikhan-Amruta Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ గురించి తెలియని వారు ఉండరు. అంతెందుకు క్రికెట్ లో కూడా ఆయన మంచి ఆటగాడే. గతంలో టీమిండియాకు కెప్టెన్ గా కూడా పని చేశాడు. కరీనా కపూర్ ను రెండో వివాహం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ ఆమెతో 15 సంవత్సరాలకు పైగా సహజీవనం చేశాడు. ఈ జంట తరచుగా ఏకాంత సమయాన్ని గడపడం, ఒకరి సాంగత్యాన్ని మరొకరు కోరుకోవడం కనిపిస్తుంది. అయితే, సైఫ్ కరీనాకు ముందు అమృతా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో తన జీవితం చాలా కష్టాలతో కొనసాగిందని చెప్పుకచ్చాడు. ఆమె గృహ హిం

    సను ఎదుర్కొందని చెప్పుకచ్చిన సైఫ్ ఇప్పటికీ తనను అలా చూసిన ఘటనలు నా కళ్ల ముందు నుంచి పోలేదన్నాడు. వీరి వివాహం తర్వాత 13 ఏళ్లకు విడిపోయారు. సైఫ్ అలా ఖాన్-అమృత సింగ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ తన కొడుకు ఫొటో తన పర్సులో ఉంటుందని, తన కూతురును కలిసే అవకాశం రావడం లేదని వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని సైఫ్ అలాఖాన్ అన్నారు. సైఫ్, అమృత మధ్య సంబంధం 1990 లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఈ జంట అత్యంత పాపులర్ గా మారింది.

    Saif Alikhan-Amruta Singh 2

    పరిచయం, ప్రేమ, పెళ్లి..
    సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ ను ఒక ఫొటోషూట్ లో కలిశాడు. వారివి భిన్నమైన వ్యక్తిత్వాలు అయినప్పటికీ.. సైఫ్ ను చూసిన వారు సులభంగా ఆకర్షితులవుతారు. అమృత నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. వీరిద్దరూ కొంత కాలం డేటింగ్ కొనసాగించారు. వీరి పెళ్లి సైఫ్ కుటుంబం అనుమతించలేదు. అయినా ఈ జంట 1991లో వివాహం చేసుకుంది. సైఫ్ వయస్సు, కెరీర్, తదితరాలను దృష్టిలో ఉంచుకొని ఆయన తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లి వద్దన్నారు. అయితే వీరి దాంపత్యం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2004లో 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత మనస్పర్థలతో విడిపోయారు.

    చాలా కాలం తర్వాత సైఫ్ అలీ ఖాన్ అమృత, ఆమెతో కలిగిన ఇద్దరు పిల్లలు, అమృతతో వైవాహిక జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అమృతది నాడి వేర్వేరు మార్గాలని, నేను భయంకరమైన భర్తనని, భయంకరమైన తండ్రినని, ఆమె పదేపదే గుర్తు చేసేది, నా పర్సులో నా కొడుకు ఇబ్రహీం ఫోటో ఉంది. అది చూసిన ప్రతిసారీ నాకు ఏడవాలనిపిస్తుంది. నా కూతురు సారాను మిస్ అవుతున్నా’ అని పేర్కొన్నారు.

    వారిని నా వద్దకు రానివ్వకపోవడంతో వారితో నా అటాచ్ మెంట్ తక్కువని  సైఫ్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఎందుకంటే నా జీవితంలో ఒక కొత్త మహిళ ఉంది, ఆమె నా పిల్లలను వారి తల్లి (అమృతా సింగ్)కి వ్యతిరేకంగా ప్రభావితం చేస్తుంది. అది చాలా విడ్డూరంగా ఉందని, ఇదంతా అమృతకు తెలుసునని అన్నారు.

    భరణం గురించి
    విడాకుల తర్వాత తాను అమృతకు రూ. 5 కోట్లు ఇవ్వాల్సి ఉందని, అందులో ఇప్పటికే రూ. 2.5 కోట్లు ఇచ్చానని చెప్పారు. నా కుమారుడికి 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. లక్ష చెల్లిస్తున్నాను అని పేర్కొన్నాడు.