https://oktelugu.com/

Crime News : నూనూగు మీసాల వయసు.. గంజాయి తాగారు.. ఆ మత్తులో బాలికపై పాశవికం

మత్తు.. ఇది ఏ రూపంలో ఉన్నా అనర్ధమే. మత్తు అనేది మనిషిని మృగంలాగా మార్చుతుంది. ఆ క్షణంలో ఎంతటి దారుణానికైనా తెగించేలాగా చేస్తుంది. అయితే అలాంటి మత్తుకు బానిసలైన మైనర్లు దారుణానికి పాల్పడ్డారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 2, 2024 / 04:02 PM IST

    Crime News

    Follow us on

    Crime News :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దోమ మండలంలో ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఐదుగురు మైనర్లు మత్తుకు అలవాటు పడ్డారు. తరచూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ మత్తు సరిపోక గంజాయి పీల్చడం ప్రారంభించారు. అదే ఇటీవల గంజాయి వాడకాన్ని విపరీతం చేశారు. ఆ మైకంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఆ ఐదుగురిలో ఒకరికి ఇటీవల ఆ గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువుకు దారితీసింది. ఇటీవల ఆ విద్యార్థిని ఆ బాలుడిని కలిసింది. వారిద్దరూ చనువుగా మెలిగారు.. అనంతరం ఆ బాలుడు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అదే గ్రామంలోని మరో బాలుడు ఇంటికి ఆ బాలికను తీసుకెళ్లారు. అక్కడ మిగతా బాలురు కూడా ఉన్నారు. వారంతా గంజాయి తాగారు. విడతలవారీగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ బాలిక ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో ఆ బాలిక జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులతో చెప్పుకుంది. దీంతో వారు ఆ అమ్మాయిని నిలదీయగా అసలు విషయాన్ని చెప్పింది.

    పోలీసుల అదుపులో..

    ఆ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఘటనకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. ఆ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ పలు రకాల ఆధారాల సేకరించారు.. అనంతరం ఈ దారుణానికి పాల్పడిన ఆ బాలురను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితులు డిఎస్పి ఆధీనంలో ఉన్నారు. వారిపై పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆ బాలికకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ బాలిక ప్రస్తుతం 12 వారాల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆ దారుణానికి తనకు మొదట పరిచయమైన బాలుడే కారణమని ఆ బాలిక చెబుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నప్పటికీ.. ఆ బాలుడు అతడి మిగతా నలుగురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై స్థానికంగా కలకలం చెలరేగింది. అయితే ఆ బాలికను ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బంధువుల ఇంటికి తరలించినట్లు తెలుస్తోంది.. ఈ కేసు మరింత జటిలం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐదుగురు బాలురు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే వారు గంజాయి మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు ఇస్తున్నారు? దానిని కొనుగోలు చేయడానికి వారికి డబ్బులు ఎలా వస్తున్నాయి? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.