Amaraan 2Day Worldwide Collection : తమిళనాడులో రైజింగ్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా శివ కార్తికేయన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒక టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, ఆ తర్వాత కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి, హీరోగా మారి వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని, మార్కెట్ ని ఏర్పర్చుకున్న ఆయన ప్రయాణం కొత్తవాళ్లకు ఎంతో ఆదర్శప్రాయమైనది. ఇప్పుడు తమిళంలో విజయ్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన స్థానంలోకి శివ కార్తికేయన్ వచ్చేసాడా..?, తమిళనాడు కి కొత్త సూపర్ స్టార్ ఇతనేనా? అని అనిపించే రేంజ్ లో ఆయన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’ వసూళ్లు ఉన్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చిత్రాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
అయితే ప్రాంతాల వారీగా ఈ సినిమా రెండు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు వివరంగా చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల షేర్, 8 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కి మరో 50 లక్షల రూపాయిల దూరంలో ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చెన్నై వంటి ప్రాంతాలలో మొదటి రెండు రోజులకంటే మూడవ రోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
నాలుగు రోజుల్లో 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి, సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ క్లోసింగ్ వసూళ్లను కచ్చితంగా దాటేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అదే విధంగా ఓవర్సీస్ లో రెండు రోజులకు కలిపి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 3 కోట్ల 65 లక్షలు, కేరళలో కోటి 95 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి తెలుగు, తమిళ వెర్షన్స్ కి కలిపి 66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 34 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటి లాభాల్లోకి వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు వెర్షన్ లో వచ్చిన రెస్పాన్స్ ని చూసిన తర్వాత, ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలోకి డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్