Kamal Haasan – Allu Arjun Combination: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నటుడిగా కమల్ హాసన్ ఎలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నటనకి నిఘంటువు లాగా ఉండే కమల్ హాసన్ తో కలిసి నటించాలి అనే కోరిక ప్రతి ఒక్క ఆర్టిస్టు కి ఉంటుంది..కానీ ఆ అదృష్టం అతి తక్కువ మందికి మాత్రమే దక్కింది..ఆ అదృష్టవంతులలో ఒక్కడే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..అల్లు అర్జున్ మనకి కేవలం ఒక్క స్టార్ హీరో గా మాత్రమే తెలుసు..కానీ ఆయన హీరో కాకముందే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు..వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన విజేత సినిమా ఒకటి కాగా..కమల్ హాసన్ మరియు కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్వాతి ముత్యం సినిమా మరొకటి..ఇందులో అల్లు అర్జున్ కమల్ హాసన్ గారికి మనవడిగా ఒక్క చిన్న పాత్ర లో కనిపిస్తాడు..అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అవకాశం ఎలా లభించింది అంటే ఈ సినిమా థియేట్రికల్ రీలీజ్ ని అప్పట్లో గ్రాండ్ గా విడుదల చేసింది గీత ఆర్ట్స్ బ్యానర్.

Also Read: Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి సోదరుడి పై హత్యాయత్నం..భద్రత కల్పించిన పోలీసులు
అలా కె. విశ్వనాధ్ తో అల్లు అరవింద్ కి ఏర్పడిన పరిచయం వల్లే ఆయనకీ ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది..అప్పట్లో విశ్వనాధ్ గారు ఈ సినిమా లో చిన్న పిల్లల పాత్రల కోసం ఆడిషన్ లు చేస్తున్న సమయం లో ఆరోజు షూటింగ్ స్పాట్ కి అల్లు అరవింద్ తో పాటుగా వచ్చిన అల్లు అర్జున్ ని చూసి ‘మీ అబ్బాయిని మా సినిమాలో ఒక్క చిన్న పాత్ర కోసం తీసుకోవచ్చా..కేవలం రెండు మూడు రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది’ అని అడిగారట..విశ్వనాథ్ లాంటి దర్శకుడు అడగడం తో కాదు అనుకుంది వెంటనే ఓకే చెప్పాడట అల్లు అరవింద్..అలా చిన్న తనం లోనే అల్లు అర్జున్ కమల్ హాసన్ లాంటి మహానటుడితో నటించే అవకాశం కొట్టేసాడు..నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ కి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మార్కెట్ పరంగా అల్లు అర్జున్ కమల్ హాసన్ కంటే ఎక్కువ ఎత్తుకి ఎదిగిపోయాడు అనే చెప్పాలి..ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో నటించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు..యావత్తు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.

Also Read: Land Expatriates: బంగారు తెలంగాణలో నిర్వాసితుల పరిస్థితిదీ

