స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం రిపోర్టు వచ్చింది…! అంతే…. యాజమాని పరార్!

నిన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విజయవాడలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ ద్వారా సంభవించింది అని భావిస్తున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ. 50 లక్షల ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే బాధితుల కుటుంబాలకు ఇందుకు కారకులైన నిందితులకు శిక్ష పడితే తప్పించి ఈ పరిహారాలు వల్ల పెద్దగా మనశ్శాంతి ఉండదు. అలాంటిది […]

Written By: Navya, Updated On : August 11, 2020 4:28 pm
Follow us on

నిన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విజయవాడలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ ద్వారా సంభవించింది అని భావిస్తున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ. 50 లక్షల ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే బాధితుల కుటుంబాలకు ఇందుకు కారకులైన నిందితులకు శిక్ష పడితే తప్పించి ఈ పరిహారాలు వల్ల పెద్దగా మనశ్శాంతి ఉండదు. అలాంటిది ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

 

మరోవైపు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య, భద్రతా సిబ్బంది నివేదికలను కమిటీల సభ్యులు సిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్ వద్దకు ఇవన్నీ వెళ్లనున్నాయి. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్లు కమిటీల విచారణలో తేలినట్లు సమాచారం. స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని… కమిటీ ఎంతో సంచలనాత్మకంగా రిపోర్టులో కలప, ఫైబర్ తో తయారుచేసిన ఇంటీరియర్ డెకరేషన్ కు శానిటేషన్ ఎక్కువ కావడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని… విద్యుత్ శాఖ తేల్చింది.

ప్రమాదం జరిగిన వెంటనే దానిని గుర్తించే పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే ప్రాణ నష్టం జరిగినట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. ఇక అతనిపై కేసు నమోదు చేశారు అని తెలిసిన వెంటనే రమేష్ బాబు ఇలా తప్పించుకోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. రిస్క్ అని తెలిసినా కూడా అక్కడ కరోనా పేషెంట్లు ని ఉంచడం ఏమిటని కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు వారికి ఎవరిచ్చారని అందరూ ఆగ్రహజ్వాల తో ఊగిపోతున్నారు. పోలీసులు ప్రస్తుతానికైతే అనేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.