https://oktelugu.com/

Shyam Singha Roy: ఆ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా- సాయిపల్లవి

Shyam Singha Roy: నేచురల్​ స్టార్ నానీ హీరోగా యంగ్​ డైరెక్టర్​ రాహుల్  సాంకృత్యాన్​ దర్శకత్వంలో రానున్న సినిమా శ్యామ్ సింగరాయ్​. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టితో పాటు మోనా సెబాస్టియన్​ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కాగా, వీరిలో సాయిపల్లవి దేవదాసి పాత్రలో దర్శనమివ్వనుంది. డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానున్న సందర్భంగా వరంగల్​ వేదికగా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించింది చిత్రబృందం. Also Read: మనమే విజేతలం అంటే ఎలా నాని ? ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:30 AM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్​ స్టార్ నానీ హీరోగా యంగ్​ డైరెక్టర్​ రాహుల్  సాంకృత్యాన్​ దర్శకత్వంలో రానున్న సినిమా శ్యామ్ సింగరాయ్​. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టితో పాటు మోనా సెబాస్టియన్​ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కాగా, వీరిలో సాయిపల్లవి దేవదాసి పాత్రలో దర్శనమివ్వనుంది. డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానున్న సందర్భంగా వరంగల్​ వేదికగా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించింది చిత్రబృందం.

    Sai Pallavi

    Also Read: మనమే విజేతలం అంటే ఎలా నాని ?

    ఈ సందర్భంగా సాయిపల్లవి అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపుతున్నా అంటూ స్పీచ్​ స్టార్ట్ చేసింది. మీ అదరణ ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను వేరే రాష్ట్రం నుంచి వ్చచినా కూాడా నన్ను మీ ఇంటి అమ్మాయిలాగే చూస్తున్నారు. ఈ విషయంలో మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా.. అని పేర్కొన్నారు. నిహారిక ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై వెంకట్​ బోయినపల్లి ఈ భారీ బడ్జెట్​ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు మిక్కీ జే మేయర్​ సంగీతం అందించారు.

    మరోవైపు నాని మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తోంది. శ్యామ్ సింగ‌రాయ్ నాకు ఆ స్థాయి ఫీలింగ్‌ ఇచ్చింది. మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం ఏటిపరిస్థుతుల్లో మ‌న‌దే, మనమే ఈ క్రిస్ట‌మ‌స్ విజేతలం’ అంటూ నాని బలంగా చెప్పాడు.

    Also Read: ఈ క్రిస్మస్ “శ్యామ్ సింగరాయ్” దే అంటున్న నాని…