https://oktelugu.com/

Anchor Ravi: పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యాంక‌ర్ ర‌వి.. ఎవ‌రి మీదో తెలుసా..?

Anchor Ravi: బుల్లితెర‌పై మాస్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ర‌వి అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎన‌ర్జిటిక్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక మొన్న బిగ్ బాస్ కు కూడా వెళ్లాడు యాంక‌ర్ ర‌వి. అయితే హౌస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న మీద చాలా ర‌కాల రూమ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ అవేవీ మొద‌ట్లో ర‌వి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక బిగ్ బాస్ నుంచి రూ.80 లక్షల దాకా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2021 / 11:28 AM IST
    Follow us on

    Anchor Ravi: బుల్లితెర‌పై మాస్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ర‌వి అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎన‌ర్జిటిక్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక మొన్న బిగ్ బాస్ కు కూడా వెళ్లాడు యాంక‌ర్ ర‌వి. అయితే హౌస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న మీద చాలా ర‌కాల రూమ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ అవేవీ మొద‌ట్లో ర‌వి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక బిగ్ బాస్ నుంచి రూ.80 లక్షల దాకా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

    Anchor Ravi

    ఇప్పుడు మ‌ళ్లీ షోల‌తో ఫుల్ బిజీ అయిపోయాడు ర‌వి. పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్లీ షోలతో బిజీగా మారాడు. అయితే ఇప్పుడు అత‌ను ఓ విష‌యంలో ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. త‌న మీద కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు యాంక‌ర్ ర‌వి. వారు త‌న మీదే కాకుండా త‌న కుటుంబ స‌భ్యుల మీద కూడా ట్రోల్ చేయ‌డం బాధిస్తోందంటూ చెప్పాడు.

    ఇక పోలీసులు కూడా ర‌వి విష‌యం ప‌ట్ల సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఇదే విష‌యాన్ని మాట్లాడిన ర‌వి.. పోలీసుల‌కు దీని మీద ఫిర్యాదు చేశారు. కొంద‌రు డ‌బ్బులు తీసుకుని త‌న మీద చెడుగా ప్ర‌చారం సాగిస్తున్నార‌ని వాపోయాడు ర‌వి. త‌న మీద చేస్తే ప‌ర్వాలేదు గానీ త‌న భార్య‌, బిడ్డ‌ల మీద ప్ర‌చారం చేయ‌డం త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్టు వివ‌రించాడు.

    Also Read: Pushpa: బన్నీకి ఇష్టమైన బెస్ట్ కోలీవుడ్​ డాన్సర్​ ఎవరో తెలుసా?

    ఇక బిగ్ బాస్‌లో ఉన్న‌ప్పుడు త‌న మీద గుంట‌న‌క్క అనే ముద్ర సోష‌ల్ మీడియాలో ప‌డింది. చాలామంది ఇలాగే అత‌ని మీద ప్ర‌చారం చేశారు. ఇక యాంక‌ర్ ర‌వి కావాల‌ని కంటెస్టెంట్ల మ‌ధ్య ఇన్ ఫ్లూయెన్స్ క్రియేట్ చేస్తాడ‌ని అప్ప‌ట్లో బాగా ప్ర‌చారం సాగించారు. ఇక‌పోతే గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్ వివాదాస్ప‌దంగా మారిపోయింది. ఏకంగా కంటెస్టెంట్లు ఇలా బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌తంలో జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి.

    Also Read: Prakash Raj: మరోసారి తన మంచి మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్… ఆలస్యంగా వెలుగులోకి ఘటన

    Tags