https://oktelugu.com/

Radhe Shyam Movie: ప్రభాస్ “రాధే శ్యామ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… ఎప్పుడు, ఎక్కడో తెలుసా

Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్  ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “రాధేశ్యామ్”​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:38 AM IST
    Follow us on

    Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్  ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “రాధేశ్యామ్”​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్​లు నెట్టింట హల్​చల్​ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

    Radhe Shyam Movie

    Also Read: పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యాంక‌ర్ ర‌వి.. ఎవ‌రి మీదో తెలుసా..?

    వరుస అప్డేట్ లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తేదీ కూడా ఫిక్సైందని సమాచారం. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు చీఫ్‌ గెస్టుగా ఎవరు రానున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలుగుతో సహా మొత్తం 7 భాషల్లో ఈ పాన్‌ ఇండియా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా కృష్ణం రాజు, భాగ్యశ్రీ, సచిన్‌ కేడ్కర్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో కక్కర్లు కొడుతుంది.

    Also Read: మరోసారి తన మంచి మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్… ఆలస్యంగా వెలుగులోకి ఘటన