https://oktelugu.com/

Sai Pallavi: సాయిపల్లవి చెల్లెలు హీరోయిన్​గా పరిచయమవుతున్న సినిమా రిలీజ్​ ఈరోజే

Sai Pallavi: ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్​ను ఒక్కో సారి హీరోలు కూడా అందుకోవడం కష్టమే.. ఆ రేంజ్​లో డాన్స్ చేస్తుంది సాయిపల్లవి. కాగా, తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్​ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. సముద్రఖని, రీమా కల్లింగళ్, బేబీ మనస్వి నటించిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 01:22 PM IST
    Follow us on

    Sai Pallavi: ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్​ను ఒక్కో సారి హీరోలు కూడా అందుకోవడం కష్టమే.. ఆ రేంజ్​లో డాన్స్ చేస్తుంది సాయిపల్లవి. కాగా, తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్​ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది.

    Sai Pallavi

    సముద్రఖని, రీమా కల్లింగళ్, బేబీ మనస్వి నటించిన ‘చిత్తిరై సెవ్వానమ్’ సినిమాలో పూజ నటిగా పరిచయమయ్యారు.  స్టంట్ మాస్టర్ సిల్వా ఈ సినిమాతోనే దర్శకుడిగా అవతారమెత్తారు. ఈ క్రమంలోనే తన చెల్లెలు పూజా కన్నన్​ గురించి ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది సాయిపల్లవి.

    Also Read: విక్టరీ వెంకటేష్ సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్…

    ఆరోగ్యం బాలేదని అమ్మానాన్నతో నటించి క్లాసులు ఎగ్గొట్టడం దగ్గర నుంచి.. డిప్రెషన్​లో ఉన్నప్పుడు కూడా మంచి ఎనర్జిచిక్​గా ఉండటం వరకు ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు యాక్టర్​గా ఎదగడం చూస్తున్నారు. ఈ రోజు తను నటిగా ప్రేక్షకులకు పరిచయమవుతున్న రోజు. అని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

    సినిమాలో నటించేటప్పుడు ఎంత ఎంజాయ్​ చేసిందో.. సినిమా చూసేటప్పుడు కూడా ఆమె నటనను ప్రేక్షకులు అంతే ఏంజాయ్​ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా జీ5 వేదికగా ఓటీటీలో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం లాగ్​ఇన్​ అయ్యి చూసేయండి మరి.

    Also Read: లక్​ అంటే రవితేజదే.. కొంచెంలో అట్టర్​ఫ్లాప్​ మిస్​