https://oktelugu.com/

Shilpa Chowdary: హీరోకి రూ.3 కోట్లకు ఎగనామం పెట్టిన ‘కిలాడి’!

Shilpa Chowdary: తెలుగు రాష్ట్రాల్లో శిల్పా చౌదరి పేరు కొద్దిరోజులుగా ప్రముఖంగా విన్పిస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు ఎగపెట్టారనే ఆరోపణలను శిల్పా చౌదరి ఎదుర్కొంటున్నారు. కిట్టి పార్టీల పేరుతో వీఐపీలను పరిచయం చేసుకొని ఆ తర్వాత మాయమాటలతో శిల్పాచౌదరి మోసే మహాకిలాడి శిల్పా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కు గురవుతోంది. సినీ ఇండస్ట్రీలో ఆమె బాధితుల లిస్టు పెరుగుతుండంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2021 / 01:32 PM IST
    Follow us on

    Shilpa Chowdary: తెలుగు రాష్ట్రాల్లో శిల్పా చౌదరి పేరు కొద్దిరోజులుగా ప్రముఖంగా విన్పిస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు ఎగపెట్టారనే ఆరోపణలను శిల్పా చౌదరి ఎదుర్కొంటున్నారు. కిట్టి పార్టీల పేరుతో వీఐపీలను పరిచయం చేసుకొని ఆ తర్వాత మాయమాటలతో శిల్పాచౌదరి మోసే మహాకిలాడి శిల్పా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కు గురవుతోంది.

    Shilpa Chowdary

    సినీ ఇండస్ట్రీలో ఆమె బాధితుల లిస్టు పెరుగుతుండంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని విచారిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని సైతం శిల్పా చౌదరి బాధితుల లిస్టులో చేరిపోయారు. ఇటీవల శిల్పా చౌదరిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కోట్ల 90లక్షల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    తాజాగా శిల్పా చౌదరి చేతిలో ఓ యువ హీరో మోసపోయినట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ హీరో హర్ష్ కనుమల్లికి శిల్పా చౌదరి మాయమాటలు చెప్పి అతడికి మూడుకోట్ల రూపాయాల వరకు ఎగమానం పెట్టినట్లు తెలుస్తోంది. ‘సెహరి’ మూవీలో హీరోగా నటించిన హర్ష్ కనుమల్లి శిల్పా ఇచ్చే పార్టీలకు హాజరై ఆమె ట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది.

    ఈ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఒక్క రూపాయి కూడా ఆమె డబ్బులు పెట్టలేదని టాక్. ఓ పేరున్న రాజ‌కీయ నాయ‌కుడు పెట్టుబ‌డి పెడితే శిల్పా బినామీగా వ్యవహరించారని సమాచారం. ఈ సినిమాతోనే ఆమెకు హ‌ర్ష్ తో స్నేహం ఏర్పడింది. ఆ చనువుతోనే ఆమె అతడి వద్ద నుంచి స్థ‌లాల పేరు మీద కొంత, అప్పుగా కొంత చొప్పున మూడు కోట్ల వ‌ర‌కు ముంచేసింది.

    Also Read: వర్ష, ఇమ్మానియేల్ ప్రైవేట్ ఫోటో అందరి ముందు లీక్ చేసిన రోజా..!

    శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో ఈ యువ హీరో మూడు కోట్లు కూడా గల్లంతయినట్లేనని కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఈ యువ హీరో కాకుండా ఓ స్టార్ హీరో సైతం ఆమెను గుడ్డిగా నమ్మి పోసపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో ఆ స్టార్ హీరో ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    అయితే ఆ హీరో మీడియా ముందుకు రాకుండా తెరవెనుకే డబ్బులు వసూలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి కిలాడి శిల్పా చేతిలో టాలీవుడ్ ప్రముఖులు మోసపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: పోలీసు స్టేషన్​కు సూపర్​స్టార్​ మహేశ్ సోదరి.. ఎందుకో తెలుసా?