https://oktelugu.com/

నో ఎట్టి పరిస్థితుల్లో ముద్దు పెట్టాల్సిందే !

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల బాధలు చాల గందరగోళంగా ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా.. సినిమా ఒప్పుకున్న పాపానికి అంగాంగ ప్రదర్శన చేయాల్సిందే. అవసరం అయితే ముద్దులతో ఇబ్బంది పడినా.. డైరెక్టర్ కోరితే బెడ్ సీన్స్ కు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే.. చాలామంది హీరోయిన్లు అన్ని ఉన్నా అవకాశాలు అందుకోలేక ఇంటి ముఖం పట్టేస్తారు. ముద్దులు పెట్టను, ఎక్స్ పోజింగ్ చేయను అంటే.. ఇక ఆ హీరోయిన్ కెరీర్ సగం పోయినట్టే. […]

Written By:
  • admin
  • , Updated On : December 11, 2020 / 04:30 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల బాధలు చాల గందరగోళంగా ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా.. సినిమా ఒప్పుకున్న పాపానికి అంగాంగ ప్రదర్శన చేయాల్సిందే. అవసరం అయితే ముద్దులతో ఇబ్బంది పడినా.. డైరెక్టర్ కోరితే బెడ్ సీన్స్ కు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే.. చాలామంది హీరోయిన్లు అన్ని ఉన్నా అవకాశాలు అందుకోలేక ఇంటి ముఖం పట్టేస్తారు. ముద్దులు పెట్టను, ఎక్స్ పోజింగ్ చేయను అంటే.. ఇక ఆ హీరోయిన్ కెరీర్ సగం పోయినట్టే. అయితే ఓ హీరోయిన్ మాత్రం కిస్ సీన్స్ కు ఎక్స్ పోజింగ్ కి దూరం అని కండిషన్స్ పెట్టినా.. ఆమెకు తెగ ఛాన్స్ లు వస్తున్నాయి.

    Also Read: స్టార్ డైరెక్టర్ ను దూరం పెట్టిన స్టార్ హీరో !

    ఆ హీరోయినే సాయి పల్లవి. మొదటి నుండి ముద్దు సీన్లకి ఒప్పుకోదు సాయి పల్లవి. ఆమె ఇంతవరకు ఏ ఒక్క సినిమాలో కూడా అలాంటి సీన్లలో నటించలేదు. నటించనని కూడా ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది. ఐతే, ఒక సినిమాలో మాత్రం ఒక దర్శకుడు కచ్చితంగా కిస్ సీన్ చేయాల్సిందే అని పట్టుబట్టాడని.. చేయలేనని ఎన్ని సార్లు చెప్పినా.. నో ఎట్టి పరిస్థితుల్లో కిస్ సీన్ చెయ్యాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడట ఆ దర్శకుడు. అయితే, ఆ సమయంలో తనకు లక్కీగా “మీ టూ” ఉద్యమం కలిసొచ్చిందని.. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నా టైంలోనే మీ టూ ఉద్యమం జోరుగా సాగుతోందని అది తనను సేవ్ చేసిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

    Also Read: మహేష్ తో మిడ్ నైట్ పార్టీ.. అందుకేనా ?

    అప్పుడు పంచవ్యాప్తంగా “మీ టూ” ఉద్యమం చాలా మార్పులు తెచ్చిందని.. “ఇలాగే ముద్దు సీను కోసం పట్టుపడితే, నిన్ను కూడా మీటూ లో ఎక్స్ పోజ్ చేయాల్సి వస్తోందేమో చూడు,” అని ఆ సినిమాలో నటిస్తున్న హీరో దర్శకుడిని నవ్వుతూ హెచ్చరించడంతో సదరు దర్శకుడు భయపడిపోయాడని.. ఇక అప్పటినుండీ నన్ను ముద్దు గురించి అడగలేదు అని.. లేకపోతే నేను కూడా హీరో పెదవులతో పోటీ పడాల్సి వచ్చేది అని.. కానీ చివరి క్షణంలో ఆ ముద్దు నుండి బయట పడ్డాడని సాయిపల్లవి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్