తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కేసీఆర్ తర్వాత ప్రముఖంగా విన్పించే పేరు కోదండరామ్ దే. తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా కొనసాగిన కోదండరాం ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. వంటావార్పు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమకారుల్లో జోష్ నింపారు.
Also Read: గ్రేటర్లో ఆపరేషన్ ఆకర్ష్.. ఏ పార్టీకి కలిసొచ్చేనో?
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి ఆయన కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండటంతో కేసీఆర్.. కోదండరాం మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కోదండరాంను కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు. కోదండరాంపై పలుమార్లు అనుచిత కామెంట్స్ చేయడంతో వారి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆ తర్వాత కోదండరాం సైతం కేసీఆర్ కు వ్యతిరేకంగా కిందటి ఎన్నికల్లో మహాకూటమికి మద్దతు ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో కోదండరాం జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్తలు విన్పించాయి. అయితే కాంగ్రెస్ పొన్నాల లక్ష్మయ్యకు సీటివ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో మహాకూటమి దారుణంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత కూడా కోదండరాం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూనే వచ్చారు.
అయితే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడుతుండగా బీజేపీ బలపడుతూ వస్తోంది. ఈక్రమంలోనే కోదండరాం కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నాడనే టాక్ విన్పిస్తోంది. కాంగ్రెస్ సైతం కోదండరాం ను పెద్దగా పట్టించుకోకపోవడంతో వీరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కోదండరామ్ త్వరలో జరిగబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.
Also Read: పవన్.. నీకిది తగునా?
ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కోదండరాం పట్టభద్రుల స్థానంలో పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. కిందటి ఎన్నికల్లో కోదండరాం మహాకూటమికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోదండరాంకు మద్దతు ఇస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదాండరాం బరిలో దిగితే టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయిన సొంత ఇమేజ్ తో బరిలో దిగేందుకు కోదండరాం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్న కోదంరాం కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్