https://oktelugu.com/

సినిమాలు చేస్తే.. ఇక రాజకీయాలు ఎప్పుడు చేస్తారో..?

మహానేతలు జయలలిత, ఎం.కరుణానిధి మరణంతో తమిళ రాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఏర్పడింది. జయలలిత, కరుణానిధి లేని లోటును తీర్చడానికి కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ పార్టీలతో తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజిని ఇంకా రంగంలోకి దిగకపోయినా.. ప్రస్తుతం ఫుల్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రముఖ నటులు ఇద్దరూ 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామనే సంకేతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Also Read: స్టార్ డైరెక్టర్ ను […]

Written By:
  • admin
  • , Updated On : December 11, 2020 / 04:21 PM IST
    Follow us on


    మహానేతలు జయలలిత, ఎం.కరుణానిధి మరణంతో తమిళ రాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఏర్పడింది. జయలలిత, కరుణానిధి లేని లోటును తీర్చడానికి కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ పార్టీలతో తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజిని ఇంకా రంగంలోకి దిగకపోయినా.. ప్రస్తుతం ఫుల్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రముఖ నటులు ఇద్దరూ 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామనే సంకేతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

    Also Read: స్టార్ డైరెక్టర్ ను దూరం పెట్టిన స్టార్ హీరో !

    మరి వీరు విజయం సాధిస్తారా, లేదా అనే దాని గురించి ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చాలా ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో.. వీరి గురించి తాజాగా మరో న్యూస్ ఒకటి బాగా వినిపిస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021 వేసవిలో జరగనున్నాయి. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీలు, రాజకీయనాయకులు తప్పనిసరిగా ఇప్పటినుంచే ప్రజలని కలుస్తూ తమ పై నమ్మకం పెంచుకోవాలి. అలాగే తమ పార్టీ ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే వ్యూహాలను రచిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలి.

    Also Read: ఇంటిని ముస్తాబు చేస్తోన్న సమంత !

    కానీ అటు రజినీకాంత్, ఇటు కమల్ హాసన్ మాత్రం ప్రస్తుతం సినిమాలు చేసుకునే పనిలో పడ్డారు. వీళ్ళిద్దరూ ఫిబ్రవరి వరకు సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మరి ఇక ఎన్నికల పరిస్థితి ఏమిటి ? ఇప్పుడు తీరిగ్గా సినిమాలు చేసుకుని.. ఎన్నికల అప్పుడు ప్రచారం చేస్తామంటే కుదురుతుందా ? అసలు కమల్ హాసన్ కి రాజకీయ పార్టీ ఉన్నా.. ఆ పార్టీకి ఒక వ్యవస్థ గాని, కార్యకర్తలు గాని లేరు. అయినా కూడా ఆయన పోటీ చెయ్యాలనుకుంటే ఫలితం ఏముంటుంది ? ఇక రజిని రాజకీయ పార్టీ గురించి తెలిసిందే. మరి ఈ సూపర్ స్టార్లు సినిమాలు చేసుకుంటూ పోతే.. ఇక రాజకీయాలు ఎప్పుడు చేస్తారో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్