Sai Pallavi Kalki 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్ర లో చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ‘కల్కి’. రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), నాగ్ అశ్విన్(Nag Aswin) కాంబినేషన్ లో వచ్చిన ఈ వెండితెర అద్భుతం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం ఒక గొప్ప విషయం అయితే, ఈ సినిమాలోని క్వాలిటీ తరతరాలుగా గుర్తించుకునే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ని జోడించి అద్భుతమైన సరికొత్త ప్రపంచాన్ని చూపించాడు నాగ్ అశ్విన్. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలు లాగా కాకుండా ఎదో మొక్కుబడిగా సీక్వెల్ ని ప్రకటించడం కాదు, కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ కావాల్సిందే అనే విధంగా స్టోరీ డిమాండ్ చేస్తుంది. స్టార్ క్యాస్ట్ కూడా వేరే లెవెల్ లో కుదిరింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ ఇందులో భాగం అయ్యారు.
అయితే సీక్వెల్ నుండి దీపికా పదుకొనే ని మూవీ టీం తప్పించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే యాటిట్యూడ్ ప్రవర్తన నచ్చకే సినిమా నుండి తొలగించినట్టు ఆడియన్స్ అందరికీ అర్థం అయ్యింది. అయితే ఈ క్యారక్టర్ ఇప్పుడు ఎవరు చేయబోతున్నారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అలియా భట్ ని సంప్రదించారు. కానీ ఆమెకు ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత కృతి సనన్, అనుష్క శెట్టి వంటి వారిని సంప్రదించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు రీసెంట్ గానే ఒక వార్త ప్రచారమైంది. అయితే ప్రభాస్ మాత్రం సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నం చేయండి, ఆమె మాత్రమే ఈ క్యారక్టర్ కి సంపూర్ణమైన న్యాయం చేయగలదు అని చెప్పాడట ప్రభాస్. దీంతో మేకర్స్ సాయి పల్లవి ని సంప్రదించినట్టు తెలుస్తుంది. అంతే కాదు, ఆమెకు 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె ఈ సినిమాలో భాగం కానుందా లేదా అనేది.