Akhira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. మంచి సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే మంచి స్టార్ డమ్ ని కూడా సంపాదించుకోవచ్చు అని ఇప్పటివరకు చాలామంది ప్రూవ్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక హీరోల విషయానికి వస్తే వాళ్లు సైతం తమ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఓజీ సినిమాతో మరోసారి పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు. ఇక తన కొడుకు అయిన అఖిరా నందన్ ను సైతం తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇకమీదట తను సినిమాలు చెయ్యకపోయినా కూడా తన అభిమానులు నిరాశ చెందకూడదనే ఉద్దేశ్యంతో తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు… అఖిరా నందన్ లోనే పవన్ కళ్యాణ్ ని చూసుకోవాలని అభిమానులకు తను తెలియజేస్తారట.
ఇక అందుకే అఖిర నందన్ సినిమాకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అఖిర తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుజిత్ తోనే అఖిరనందన్ మొదటి సినిమా ఉండబోతుందట.
ఇక ఆ సినిమా ఒక డిఫరెంట్ జానర్ లో ఉంటుందని మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా ఎదిగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుజీత్ సైతం ఇప్పుడు ఓజీ సినిమా సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. దసర రోజు నానితో చేస్తున్న సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు…