OG Ticket Rates: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం ఇన్ని రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక టికెట్ రేట్స్ తో రన్ అయ్యింది. దీని వల్ల ఈ చిత్రాన్ని రిపీట్ గా చూడాలని అనుకున్న ఫ్యాన్స్, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ అత్యధిక టికెట్ రేట్స్ పెట్టి సినిమాని చూడలేక, టికెట్ రేట్స్ బాగా తగ్గిన తర్వాత చూడొచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు. కానీ నైజాం ప్రాంతం లో హై కోర్టు ‘ఓజీ’ కి అనుమతించిన టికెట్ రేట్స్ వెంటనే తగ్గించమని ఆదేశాలు జారీ చేయడం, ప్రభుత్వం సినిమా విడుదలైన 5 రోజుల తర్వాత ఓజీ టికెట్ హైక్స్ ని తగ్గిస్తూ జీవో ని పాస్ చేయడం వంటివి జరిగాయి. దీంతో ఆ పక్క రోజు నుండే టికెట్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టారు. మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఈరోజు మరియు రేపు వచ్చే వసూళ్లతో నైజాం ప్రాంతంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వబోతోంది.
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది. రేపటితో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటాయి. కానీ సీడెడ్,ఉత్తరాంధ్ర మరియు నెల్లూరు లో మాత్రం బ్రేక్ ఈవెన్ కి చాలా దూరం లో ఉంది ఈ చిత్రం. అందుకు కారణం టికెట్ రేట్స్ అని విశ్లేషకుల వాదన. ఏ సినిమాకు అయినా మూడు, నాలుగు రోజులకు మించి టికెట్ రేట్స్ భారీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఓజీ చిత్రానికి ఏకంగా 10 రోజులు టికెట్ రేట్స్ కొనసాగించారు. దీని వల్ల ఆడియన్స్ సంఖ్య భారీగా తగ్గిపోయింది, ఫలితంగా ఇంకా పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని విశ్లేషకుల వాదన. అయితే ఈ చిత్రాన్ని టికెట్ రేట్స్ తగ్గినప్పుడు చూడాలని అనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక శుభవార్త.
రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ రేట్స్ తగ్గించారు. సింగల్ స్క్రీన్స్ లో 145 రూపాయిలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 177 రూపాయలకు టికెట్ రేట్స్ అందుబాటులోకి రానుంది. రేట్స్ తగ్గించిన తర్వాత దాని ప్రభావం స్పష్టంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్నాయి. రేపు ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఒక రోజుకి ముందే హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. అంతే కాదు, థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెంచేశారు. రేపు వచ్చే వసూళ్లు దసరా రోజున వచ్చిన వసూళ్లకంటే భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా సోమవారం నుండి కూడా వసూళ్లు డీసెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని, కచ్చితంగా లాంగ్ రన్ వస్తుందని అంటున్నారు, చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.