చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా లవ్ స్టోరీ. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం కూడా ఈ సినిమా మార్కెట్ లెవల్ ను పెంచింది. అన్నిటికి మించి శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ […]

Written By: admin, Updated On : August 5, 2020 4:57 pm
Follow us on


మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా లవ్ స్టోరీ. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం కూడా ఈ సినిమా మార్కెట్ లెవల్ ను పెంచింది. అన్నిటికి మించి శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కు మంచి పేరు ఉండటం.. పైగా ముగ్గురు సక్సెస్ లో ఉండటం కూడా ఈ సినిమా పై ఉన్న అసక్తిని రెట్టింపు చేసింది. కానీ కొత్తగా ఈ సినిమాకి ఒక కష్టం వచ్చి పడింది. సినిమా ఇప్పటికే రఫ్ ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీకి రెడీగా ఉంది.

Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

దాంతో ఈ సినిమా నిర్మాతలు తమ సన్నిహితుడైన ఓ డిస్టిబ్యూటర్ కు సినిమాని చూపించారు. ఆయన సినిమా చూసాక చెప్పిన పాయింట్స్ చూస్తే.. నిజమే అనిపించిందట. సినిమా బాగా స్లోగా ఉందని.. సాయి పల్లవి పాత్ర.. హీరో పాత్రను పూర్తిగా డామినేట్ చేస్తోందని ఇలా అయితే హీరో చివరకు డమ్మీ అయ్యే ప్రమాదం ఉందని.. పైగా శేఖర్ కమ్ముల గత సినినాలన్ని కలిపితే వచ్చిన సినిమాలా ఈ సినిమా ఉందని.. కచ్చితంగా సినిమాలో కొన్ని హీరోయిన్ సీన్స్ ను లేపేయాలని చెప్పాడట. ఆయితే లవ్ స్టోరీకి ఆ సీన్స్ చాలా కీలకం అట. అవి తీసేస్తే ఇక లవ్ స్టోరీ కష్టమే అని శేఖర్ కమ్ముల తన వెర్షన్ చెప్పుకొస్తున్నాడట.

Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

మొత్తానికి ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తరువాత కూడా శేఖర్ కమ్ములను నమ్మకపోవడం అవమానమే. అసలు శేఖర్ కమ్ముల ప్రతి సినిమాకి ఇలాంటి రచ్చే ఉంటుంది. రిలీజ్ కు ముందు ఇలాంటి కామెంట్స్ నే వినిపిస్తాయి. కాకపోతే క్రేజీ కాంబినేషన్ తో చేస్తోన్న సినిమాకి కూడా ఇలాంటి కామెంట్స్ రావడం బాధాకరం. అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి రాబోతుందనే యాంగిల్ కూడా ఈ సినిమాకి మైనస్ అని.. వాళ్లకు సినిమా అవుట్ ఫుట్ పై సరైన అవగాహన లేకపోవడంతో అనుమానంతో కొంతమందికి సినిమాని చూపించడం.. వాళ్ళు తెలిసి తెలియక ఏదేదో చెప్పడంతో అది శేఖర్ కమ్ములకు బాగా ఇబ్బంది కలిగిస్తోందని టాక్.