https://oktelugu.com/

క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు

సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ కి అసలు టైమ్ కలిసి రావడం లేదు. మణికర్ణిక అంటూ కంగనాతో గొడవ.. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ అని బాలయ్యతో డిజాస్టర్ల పర్వం మొత్తానికి క్రిష్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే ఈ సారి ఎంతో కసితో సినిమాని ప్లాన్ చేశాడు. ఏకంగా పవర్ స్టార్ ని ఒప్పించాడు. దాంతో క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ […]

Written By:
  • admin
  • , Updated On : August 5, 2020 / 05:08 PM IST
    Follow us on


    సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ కి అసలు టైమ్ కలిసి రావడం లేదు. మణికర్ణిక అంటూ కంగనాతో గొడవ.. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ అని బాలయ్యతో డిజాస్టర్ల పర్వం మొత్తానికి క్రిష్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే ఈ సారి ఎంతో కసితో సినిమాని ప్లాన్ చేశాడు. ఏకంగా పవర్ స్టార్ ని ఒప్పించాడు. దాంతో క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి క్రిష్ పర్సనల్ లైఫ్ తో పాటు సినిమా లైఫ్ కూడా బాగా ఇబ్బందులు కలుగజేసింది. వీటికి తోడు కరోనా వచ్చి సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయిపోయింది. ఇది అందరి సమస్యే. కానీ కరోనా అనంతరమైన మిగితా డైరెక్టర్ల సినిమాలు మొదలవుతాయి. క్రిష్ సినిమా తప్ప.

    Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

    నిజానికి ఈ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వారికి నిరాశ తప్పేలా లేదు. కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాని ఈ ఏడాది మొత్తం పోస్ట్ ఫోన్ చేయనున్నారు. పైగా వచ్చే ఏడాది కూడా పవన్ ముందుగా వకీల్ సాబ్ కి డేట్స్ ఇస్తాడు. ఆ సినిమా ఫినిష్ చేసి.. అప్పుడు క్రిష్ సినిమా మీదకు వస్తాడు. అంటే అన్ని బాగుంటే.. వచ్చే ఏడాది సమ్మర్ కి గాని షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ కరోనా అప్పటిదాకా వదలకపోతే ఇక క్రిష్ సినిమా 2022లోనే. ఈ లోపు ఎన్నో మారొచ్చు. నిజానికి ఇది చాలా టైం. క్రిష్ ని బాగా ఇబ్బంది పెట్టే టైం. మాములుగా అయితే ఈ లోపు క్రిష్ మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తాడు. కానీ పవర్ స్టార్ తో సినిమాని మాత్రం ఇప్పుడు క్రిష్ మూడు సంవత్సరాలు చేసేలా ఉన్నాడు.

    Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

    ఇక ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా జాక్వెలిన్ చేస్తోంది. సినిమాలో ఆమె ఒక పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. భారీ సెట్లతో భారీ స్థాయిలో ఈ సినిమాని క్రిష్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.