రామ్ ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హట్ అవ్వడంతో.. మొత్తానికి రామ్ కొత్త చిత్రం ‘రెడ్’కి బాగా కలిసొచ్చింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రెడ్ కు మొదటి రోజు రూ.6.7 కోట్ల రూపాయల షేర్ (ఏపీ+నైజాం) వచ్చింది అంటే.. రామ్ మార్కెట్ రేంజ్ ను అర్ధం చేసుకొవచ్చు. నిజానికి హిట్ టాక్ ఉన్న ‘క్రాక్’కే కలెక్షన్స్ లేవు అట. అలాంటది ప్లాప్ టాక్ తెచ్చుకున్న రెడ్ కి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. […]

Written By: Neelambaram, Updated On : January 15, 2021 7:34 pm
Follow us on


ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హట్ అవ్వడంతో.. మొత్తానికి రామ్ కొత్త చిత్రం ‘రెడ్’కి బాగా కలిసొచ్చింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రెడ్ కు మొదటి రోజు రూ.6.7 కోట్ల రూపాయల షేర్ (ఏపీ+నైజాం) వచ్చింది అంటే.. రామ్ మార్కెట్ రేంజ్ ను అర్ధం చేసుకొవచ్చు. నిజానికి హిట్ టాక్ ఉన్న ‘క్రాక్’కే కలెక్షన్స్ లేవు అట. అలాంటది ప్లాప్ టాక్ తెచ్చుకున్న రెడ్ కి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. అది రామ్ వల్లే అనుకోవాలి.

Also Read: ‘బాహుబలి 2’ ‘ఆర్ఆర్ఆర్’ కంటే ‘కేజీఎఫ్ 2’కే.. !

ఏది ఏమైనా ఈ చిత్రంకు వచ్చిన స్పందనకు, మొదటిరోజు కలెక్షన్స్ కు పొంతన లేదు. ఓవరాల్ గా ఊహించిన దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ ను సాధిస్తోంది ఈ సినిమా. మొదటి షో నుండే ఫుల్ ఆక్యుపెన్సీని అందుకున్న ఈ చిత్రం సెకండ్ షో వరకు అదే జోరును కొనసాగించడం అంటే మాటలు కాదు. ఇక ఈ సినిమా ప్రాంతాల వారీగా వసూళ్లను చూస్తే.. ఈ కింద విధంగా ఉన్నాయి.

గుంటూరు – 46.5 లక్షలు
కృష్ణా – 35.3 లక్షలు
వెస్ట్ – 95.7 లక్షలు
నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 1.17 కోట్లు
నెల్లూరు – 36 లక్షలు
ఈస్ట్ – 63.85 లక్షలు
ఉత్తరాంధ్ర – 53 లక్షలు

Also Read: ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే !

అసలు మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవడం, పైగా ఈ కరోనా సెకెండ్ వేలో అసలు ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా రారా అనే ఎన్నో అనుమానాల మధ్య, మొత్తానికి రామ్ తన రెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద బాగానే హడావుడి చేస్తున్నాడు. బి, సి సెంటర్లలో ఈ సినిమా గట్టిగా నిలబడే అవకాశం ఉంది. యావరేజ్ టాక్ వచ్చినా, జనం మాత్రం ఇంట్రస్ట్ గా సినిమాని చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్